E-Paper
Advertisement

Indian Navy Recruitment: డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఇండియన్ నేవీలో జాబ్స్.. త్వరపడండి..

Indian Navy Recruitment: డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఇండియన్ నేవీలో జాబ్స్.. త్వరపడండి..
Advertisement

Indian Navy Recruitment: డిగ్రీలో బీకామ్, బీటెక్, బీఈ, ఎమ్మె్స్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. ఇండియన్ నేవీలో 270 ఎస్.ఎస్.సీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Advertisement

ఇండియన్ నేవిలో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 270

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, పైలట్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(అబ్జర్వర్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఇంజినీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నావల్ కన్ స్ట్రక్టర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

ఖాళీల వారీగా పోస్టులు..

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 60

పైలట్: 26

నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 22

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 18

లాజిస్టిక్స్: 28

ఎడ్యుకేషన్ బ్రాంచ్: 38

ఎలక్ట్రికల్ బ్రాంచ్: 45

నావల్ కన్ స్ట్రక్టర్: 18

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హత ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక పాసై ఉంటే సరిపోతుంది. మరి కొన్ని ఉద్యోగాలకు బీఈ, బీటెక్, ఎంబీఏ, బీఎస్సీ, బీకామ, ఎంసీఏ, ఎమ్మెస్సీ పాసై ఉండాలి.

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉద్యోగానికి సంబంధించి 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. పైలట్ ఉద్యోగానికి 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండి.. సీపీఎల్ లైసెన్స్ కల్గి ఉండాలి. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. లాజిస్టిక్ పోస్టుకు ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్, ఎంబీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంసీఏ, ఎమ్మెస్సీ పాసై ఉండాలి. ఎడ్యుకేషన్ బ్రాంచ్ పోస్టుకు 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, బీఈ, బీటెక్ పాసై ఉండాలి. ఇంజినీరింగ్ బ్రాంచ్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. ఎలక్ట్రికల్ బ్రాంచ్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. నావల్ కన్ స్ట్రక్టర్ పోస్టుకు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2001 జనవరి 2 నుంచి 2006 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు 2002 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. మరికొన్ని ఉద్యోగాలకు 1999 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 8

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 25

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/

Also Read: Pakistan China Navy Drills: పాక్ చైనా సంయుక్త నౌకాదళ విన్యాసాలు.. హిందూ మహాసముద్రంలో భారత్‌కు డేంజర్?

అర్హత ఉన్నఅభ్యర్థులు అందరూ వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×