BigTV English

Polytechnic: స్టూడెంట్స్ అలెర్ట్! పాలిటెక్నిక్‌తో గోల్డెన్ ఫ్యూచర్.. కొలువులే కొలువులు..

Polytechnic: స్టూడెంట్స్ అలెర్ట్! పాలిటెక్నిక్‌తో గోల్డెన్ ఫ్యూచర్.. కొలువులే కొలువులు..

Polytechnic course: రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇంకొన్ని రోజుల్లో విద్యాధికారులు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పది పాసైన తర్వాత స్టూడెంట్స్ సందిగ్ధంలో పడిపోతారు. తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి..? ఎటు వైపు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే సందిగ్ధత విద్యార్థుల్లో ఉంటుంది. టెన్త్ క్లాస్ పాస్ కాగానే ఇంటర్, ఆ తర్వాత ఎంసెట్, నీట్ లేదా డిగ్రీ, పీజీ కోర్సులు చేయాలని అనుకుంటారు. కానీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తక్కువ ఖర్చుతో సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని నాలుగేళ్లలో మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు.


టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు డిప్లొమా కోర్సు మంచి సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలనుకునే వారికి డిప్లొమా ఓ వరం లాంటిది. మూడేళ్ల కోర్సు పూర్తి అవ్వగానే చక్కటి ఉద్యోగ అవకాశాలు, పాలిటెక్నిక్‌ కోర్సులతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు బోలెడు ఉంటాయి.  పాలిటెక్నిక్ మూడేళ్లు చదివిన తర్వాత బీటెక్ లో నేరుగా సెకండియర్ లో చేరవచ్చు. అంతేకాదు.. మంచి కాలేజీలో బీటెక్ సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు చాలా కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా.. బీటెక్, డైకిన్, రోడ్డు భవనాలు, ఎయిర్‌లైన్స్, మెట్రో, రవాణాశాఖ, ఆర్టీసీ, ట్రాన్స్‌ కో, జెన్‌ కో, డిస్కం, బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, ఆర్మీ, నేవి, సింగరేణి, కార్పొరేట్‌ సంస్థలు, ఇవేకాక సాఫ్ట్‌ వేర్‌ సంస్థల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు బోలెడన్నీ ఉంటాయి. అయితే పాలిటెక్నిక్ లో చేరాలంటే పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.


తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఇప్పటికే పాలిసెట్ -2025 నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 దరఖాస్తుకు చివరి తేది. ఆ లోగా విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. లేట్ ఫీజు రూ.100తో ఏప్రిల్‌-22వరకు, రూ.300తో ఏప్రిల్‌-23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష తేది మే 13న నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్‌ సైట్‌లో చూడవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.sbtet.telangana.gov.in/

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 19

దరఖాస్తు ఫీజు: బీసీ, జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఫీజు ఉంటుంది.

పరీక్ష విధానం: 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2:30 గంటలు ఉంటుంది. మ్యాథ్స్-60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30, బయాలజీ-30 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. టెన్త్ క్లాస్ సెలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయి.

పాలిటెక్నిక్‌తో బంగారు భవిష్యుత్తు..

మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సుతో మంచి భవిష్యత్తు ఉంటుంది. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కోర్సు చివరి దశలోనే ఉద్యోగ అవకాలు వస్తాయి. ఈ మూడేళ్ల కోర్సుతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. డిప్లొమా పాసైన తర్వాత బీటెక్ సెకండియర్ లో చేరవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ బీటెక్ కూడా పూర్తి చేయొచ్చు.

ALSO READ: NHSRCL Recruitment: డిప్లొమా, బీటెక్ అర్హతలతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

ALSO READ: NABARD Jobs: నాబార్డ్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.50 లక్షల జీతం భయ్యా.. నేడే లాస్ట్ డేట్..!

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×