NHSRCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL) లో పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న చీఫ్ ఫెసిలిటీ కంట్రోలర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 15 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాలు ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో డిప్యూటీ చీఫ్ ఫెసిలిటీ కంట్రోలర్ (సివిల్), డిప్యూటీ చీఫ్ ఫెసిలిటీ కంట్రోలర్ (ట్రాక్), డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ (ఎలక్ట్రికల్), డిప్యటీ చీఫ్ కంట్రోలర్ (ఎస్ అండ్ టీ), డిప్యూటీ చీఫ్ ట్రైన్ అండ్ క్ర్యూ కంట్రోలర్, డిప్యూటీ చీఫ్ ట్రైన్ అండ్ క్ర్యూ కంట్రోలర్ (ట్రైన్ ఆపరేషన్), తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు:
డిప్యూటీ చీఫ్ ఫెసిలిటీ కంట్రోలర్(సివిల్): 02
డిప్యూటీ చీఫ్ ఫెసిలిటీ కంట్రోలర్(ట్రాక్): 01
డిప్యూటీ చీఫ్ కంట్రోలర్(ఎలక్ట్రికల్): 03
డిప్యూటీ చీఫ్ కంట్రోలర్(ఎస్ అండ్ టీ): 03
డిప్యూటీ చీఫ్ ట్రైన్ అండ్ క్ర్యూ కంట్రోలర్(రోలింగ్ స్టాక్): 02
డిప్యూటీ చీఫ్ ట్రైన్ అండ్ క్ర్యూ కంట్రోల్(ట్రైన్ ఆపరేషన్స్): 03
డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ అండ్ ప్యాసెంజర్ కంట్రోలర్: 06
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 15
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 45 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులక మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.46,000 – రూ.1,45,000 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nhsrcl.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.46,000 – రూ.1,45,000 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 15