Brahmam: బ్రహ్మంగారి కాలజ్ఞానం దడ పుట్టిస్తుంది. ఈ సంవత్సరం జరిగే అనర్థాలు తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్టే భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ఆ ప్రకృతి విలయానికి ప్రపంచం మొత్తం కన్నీరు కార్చింది. ఇక ముందు కూడా ఇలాంటి విపత్కర పరిస్థులు రాబోతున్నాయని.. ప్రకృతి విలయతాండవం ప్రపంచానికి పెను సవాలుగా మారనుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. ఇక ముందు రాబోయే విపత్తును ఎదుర్కోంనేందుకు ఈ మానవాళి సిద్దంగా ఉండాలంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి కాలజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడో నాలుగు వందల ఏళ్ల కిందటే మన దేశంలో.. ప్రపంచంలో జరగబోయే విషయాలు.. భవిష్యత్తును తన కాలజ్ఞానంలో చెప్పిన బ్రహ్మంగారంటే తెలుగు ప్రజలకు నమ్మకం ఎక్కువే. బ్రహ్మంగారి కాలజ్ఞానంపై ఎన్నో ఆడియోలు.. వీడియోలు.. చివరకు సినిమాలు కూడా మన తెలుగులో వచ్చాయి. ఆయన రచించిన తాళపత్ర గ్రంథాల్లోని భవిష్యవాణిని ప్రజలకు సరళంగా తెలిపేందుకు అనేక మాధ్యమాల ద్వారా ఔత్సాహికులు అందించారు. 80, 90వ దశకంలో అయితే ఏ ఇంట చూసిన బ్రహ్మం గారి కాలజ్ఞానం ఆడియో క్యాసెట్స్ దర్శనమిచ్చేవి. సమయం దొరికిన ప్రతిసారి సినిమా పాటల కన్నా ఎక్కువగా ఆ కాలజ్ఞానం ఆడియోలే వినేవాళ్లు జనాలు. అయితే జనంలో అంత క్రేజ్ రావడానికి కూడా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం మొత్తం నిజమవడం. ఆయన చెప్పిన ప్రతి విషయం జరుగుతూ వచ్చాయి.. అవన్నీ ప్రజలు కళ్లారా చూస్తున్నారు.
అంతటి నమ్మకం ఉన్న బ్రహ్మంగారే స్వయంగా రాసిన కాలజ్ఞానంలో ఈ 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలను రాసినట్టు పండితులు చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు వస్తాయని.. ప్రపంచం మొత్తం షాక్ కు గురవతుందని చెప్పారు ఆయన చెప్పినట్టు గానే ఈ మధ్యలో బ్యాంకాక్, మయన్మార్‌లలో వచ్చిన భూకంపాన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు. దీంతో బ్రహ్మం గారి కాలజ్ఞానం మరోసారి నిజమైందని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మరిన్ని విపత్తుల సంభవించబోతున్నట్టు కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.
ఈ సంవత్సరం ప్రపంచం గందరగోళ పరిస్థితిలోకి వెళ్తుందని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఒక వైపు యుద్దాలు, ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు కుదేలైపోతాయని తెలిపారు. ఆకలి కేకలు ప్రపంచాన్ని చుట్టుముడతాయని.. యుద్దాల వల్ల బంగారం, ముడి చమురు రేట్లు ఆకాశాన్ని అంటుతాయని చెప్పారు. దీంతో ప్రజల రోజు వారి జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతాయన్నారు. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని.. మందు లేక ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందంటున్నారు. ఈ సంవత్సరం శ్రావణ, బాద్రపద మాసాల్లో అంటూ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో మన దేశంలో ఒక వైపు తుపాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరోవైపు తాగునీటకి ప్రజలు అష్టకష్టాలు పడతారని చెప్తున్నారు.
ఈ 2025 సంవత్సరం నుంచి సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీరప్రాంత నగరాలను ముంచెత్తుతుందట. అయితే ఈ సంఘటనకు ముందే సముద్రంలోంచి వింత జంతువులు బయటకు వస్తాయని వాటి రాకతోనే ప్రళయం రాబోతుందని గమనించాలని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్టు చెప్తున్నారు. భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే కృష్ణా గోదావరి నదులకు భయంకరమైన వరదలు వస్తాయని.. కృష్ణా నది మధ్యలో ఈ సంవత్సరం బంగారు రథం కనిపిస్తుందని ఆ రథం కాంతిని చూసిన ప్రజల కళ్లు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసినట్టు పండితులు చెప్తున్నారు. ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడిభుజం కదలడం మొదలవుతుందని కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు.
ఇంకా ఈ సంవత్సరం చాలా వింతలు విశేషాలు జరుగుతాయని సౌర తుఫానులు ప్రపంచాన్ని ముంచెత్తుతాయని దీంతో సమాచార వ్యవస్థ చెల్లాచెదురైపోతుందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు తెలియజేస్తున్నారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్