Golkonda Army Public School Jobs: నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశమే అని చెప్పవచ్చు. బీఎడ్, టెట్ ఉత్తీర్ణత సాధించి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇంత మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు.
హైదరాబాద్ మహానగరంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండలో రెగ్యులర్, ఫిక్స్ డ్ టర్మ్ ప్రాతిపదికన కింద టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య తెలియజేయలేదు..
పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి..
*పీజీటీ(మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పీఓఎల్ సైన్స్ అండ్ సైకాలజీ)
*టీజీటీ(హిందీ, మ్యాథ్స్, మ్యూజిక్, డాన్స్, పీఈటీ అండ్ కంప్యూటర్)
*పీఆర్టీ(అన్ని సబ్జెక్టులు, మ్యూజిక్, డాన్స్, పీఈటీ అండ్ కంప్యూటర్)
*ప్రీ ప్రైమరీ టీచర్స్ (ఆల్ సబ్జెక్ట్స్)
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎడ్, డీఈసీఎడ్ పాస్, సీటెట్/టెట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి 40 ఏళ్లకు మించి ఉండకూడదు.
దరఖాస్తు ఫీజు: 250
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్, గొల్కోండ, హైదర్ష కోట్, ఇబ్రహీం బాగ్ పోస్ట్, సన్ సటీ, హైదరాబాద్ చిరునామాకు పోస్టు ద్వారా పంపితే సరిపోతుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 25
అఫీషియల్ వెబ్ సైట్: https://www.apsgolconda.edu.in/
టీచింగ్ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది సువర్ణవకాశం. అవకాశం మళ్లీ రాదు. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి . ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.