Social Media Executive Posts: ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు. డిగ్రీ, బీటెక్ పాసైన వారికి శుభవార్త. మంత్రుల కార్యాలయాల్లో పని చేయడానికి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఏపీ రాష్ట్ర మినిస్టర్స్ పేషిల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి. ఎంపికైన వారికి రెండు నెలల ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 15
ఇందులో రెండు రకాలు ఉద్యోగాలున్నాయి. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సోషల్ మీడయా ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 09
సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులు: 06
ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: సోషల్ మీడియా ఉద్యోగాలకైతే బీఈ ఆర్ బీటెక్ పాసై ఉండాలి.
సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
జీతం: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.50వేల వేతనం కల్పిస్తారు.
సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు రూ.30వేల వేతనం కల్పిస్తారు.
*ఉద్యోగాన్ని సెలక్ట్ చేసే విధానంలో ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.
దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 27
దరఖాస్తుకు చివరి తేది: 2024 జనవరి 3
అప్లికేషన్ పంపాల్సిన ఈ మెయిల్ ఐడీ: info.apdcl@gmail.com
ఉద్యోగానికి సెలెక్ట్ చేసే విధానం: దరఖాస్తు చేసిన వారిని షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యు కి పిలుస్తారు.
Also Read: NLC Jobs: రాత పరీక్ష లేకుండా జాబ్.. ఇది ఉంటే సరిపోద్ది.. భారీగా వేతనం..
ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వయోపరిమితి: 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు ఉన్న వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనంతో కూడిన జీతాన్ని ఇస్తారు.