IPL Clashes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) ప్రారంభం అయి దాదాపు 17 ఏళ్లు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. జనాలు విపరీతంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఆదరిస్తున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చి నెల నుంచి ప్రారంభం కానుంది. మే చివరి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరుగుతుంది. అయితే… ఇలాంటి తరునంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు జరిగిన గొడవలు వైరల్ గా మారాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ పదవ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మొహాలీ స్టేడియంలో జరిగింది. పంజాబ్ మ్యాచ్ విజయం అనంతరం ఓటమితో కలత చెందిన శ్రీశాంత్ హర్భజన్ సింగ్ ని హేళన చేశాడు.
Also Read: Irfan Pathan: రెండుగా చీలిన టీమిండియా… డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్..?
కోపంతో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ ని చెంపపై కొట్టాడు. దీంతో శ్రీశాంత్ ( Sreesanth) మైదానంలో ఏడవడం మొదలుపెట్టాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకున్నారు 2023 లక్నోలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli), గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. కోహ్లీని లక్నో బౌలర్ నవీన్ ఉల్హాక్ చులకన చేయడంతో గొడవ ప్రారంభమైంది. కోహ్లీ కూడా గట్టిగా సమాధానం ఇచ్చాడు. అంతకుముందు మ్యాచ్ లో లక్నో గెలిచినప్పుడు గంభీర్ చేసిన సంజ్ఙనలకు కోహ్లీ రియాక్ట్ అవడంతో గొడవ పెద్ద ఎత్తున జరిగింది. కోహ్లీకి, గంభీర్ కి మ్యాచ్ ఫీజులో 100% జరిమానాని కూడా విధించారు.
ఇది ఇలా ఉండగా.. ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు ( RCB) జట్టు చాలా హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. మెగా వేలంలో ఆర్సిబి వ్యవహరించిన తీరుపై తోలుత విమర్శలు వచ్చినప్పటికీ యాజమాన్యం మాత్రం ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. విరాట్ కోహ్లీని 21 కోట్లకు, రజత్ పాటీధార్ ను 11 కోట్లకు తీసుకుంది. యశ్ దయాల్ ను 5 కోట్లకు కైవసం చేసుకుంది. అయితే పాటిదార్ ను ఎందుకు అంత విలువైన ఆటగాడో తాజాగా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ టీ20లో చూస్తే అర్థమవుతోంది. అయితే ఫైనల్ లో ముంబై గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయినప్పటికి పాటిధార్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ తో రఫ్పాడించాడు.
Also Read: Glenn Maxwell’s Catch: మాక్స్ వెల్ క్రేజీ క్యాచ్..బిత్తరపోయిన బ్యాట్స్ మెన్ !
48 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 81 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతని పోరాటం వృధాగా మిగిలిపోయింది. మధ్యప్రదేశ్ నిర్ణిత 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా, ముంబై ఇండియన్స్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేదించింది. అయితే ఈ టోర్నీలో సత్తా చాటితే రజత్ పాటిదార్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆర్సిబి ముందు నుంచి అనుకుంటుంది. ఆర్సిబి నమ్మకాన్ని పాటిదార్ వమ్ము చేయకుండా మధ్యప్రదేశ్ ను సక్సెస్ఫుల్ గా నడిపించాడు. అతడి సహకారం వలనే జట్టు ఫైనల్ కు చేరుకుంది. టైటిల్ గెలవకపోయినా పాటిదార్ ప్రదర్శనకు ఆర్సిబి జట్టులో సంబరాలు మొదలయ్యాయి.