Heart Attack: సమ్మర్‌లో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో రక్త నాళాలు ఇరుకుగా మారి రక్తపోటు పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా గుండెపై ఎక్కువ ఒత్తిడి పెరగుతుంది. చాలా సార్లు ఈ సమస్యలు శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. అనేక తప్పుడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఈ సమస్యల నుండి బయటపడటానికి.. మీరు మీ జీవనశైలిలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాలి. మీ గుండెకు హాని కలిగించే 5 అలవాట్లను వీలైనంత త్వరగా వదులుకోవడం మంచిది.
వ్యాయామం:
ఉదయం పూట ఎక్కువగా వ్యాయామం చేయకూడదు. దీనివల్ల మన శరీరంలోని సిరలు కుంచించుకుపోతాయి. మీరు ఉదయాన్నే ఎక్కువగా వ్యాయామం చేస్తే.. అది మీ గుండెపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
మద్యం, ధూమపానం:
మద్యం, ధూమపానం అలవాటు ఉన్న వారు కానీ ఈ అలవాట్లు మన గుండెకు చాలా హానికరం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు తప్పుతుంది. మరో వైపు సిగరెట్ సిరల సంకోచానికి కారణమవుతుంది. అంతే కాకుండా సిగరెట్ వల్ల మన శరీరంలో ఆక్సిజన్ కు బదులుగా కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో కలిసిపోతుంది. ఎక్కువగా సిగరెట్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
నూనె, ఉప్పుగా ఉండే ఆహారాలు:
మనం తరచుగా వేయించిన, ఉప్పుగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాం. కానీ ఈ అలవాటు మన గుండె ఆరోగ్యానికి హానికరం. నూనె పదార్థాలు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అంతే కాకుండా ఉప్పును అధికంగా తీసుకుంటే.. అది రక్తపోటు సమస్యలను కలిగిస్తుంది. ఈ రెండూ మన గుండె ఆరోగ్యానికి నేరుగా హాని కలిగిస్తాయి. అంతే కాకుండా నట్స్, తాజా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ , తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
శారీరక శ్రమ చేయండి:
చాలా మంది శారీరక శ్రమలను తగ్గిస్తుంటారు. దీని కారణంగా ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. నడక, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలను చేర్చుకోండి. దీని వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడానికి, శారీరక శ్రమ అవసరం.