Engineering Fees: తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. కౌన్సెలింగ్ మూడు దశల్లో జరుగుతుంది. ఆగస్టు 23 నాటికి ముగియుంది. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా వెల్లడించారు. ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్ కోర్సులకు పాత ఫీజులను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లోని ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. కౌన్సెలింగ్ మూడు దశల్లో ఆగస్టు 23 వరకు జరుగు తుందని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు మొత్తం 176 కళాశాలలు ప్రక్రియలో పాల్గొంటాయి. అందులో 156 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, 19 ప్రభుత్వ కళాశాలలు కౌన్సెలింగ్‌లో ఉండనున్నాయి.
ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. బీటెక్ కోర్సులకు ఈ ఏడాది పాత ఫీజులనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఆపై ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ సహా బి-ఒకేషనల్ కోర్సులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై కాసింత ఆర్థిక భారం తప్పింది.
ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ప్రభుత్వం రియింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. ఫీజుల సవరణపై ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిన ప్రతిపాదనలు న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా లేవని తెలిపింది. కళాశాలల ప్రతిపాదనలను పరిశీలించేందుకు అధికారులతో ప్రత్యేక కమిటీ వేయనుంది. ఆ కమిటీ ఫీజుల పెంపు ప్రాతిపదికను పరిశీలించనుంది.
ALSO READ: రైల్వేశాఖలో టెక్నిషియన్ జాబ్స్.. 6238 ఖాళీలు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇతర రాష్ట్రాలు ఫీజులు ఎలా అమలు చేస్తున్నాయి అనే అంశాలను సైతం కమిటీ పరిశీలించనుంది. అన్ని ఇంజనీరింగ్ కళాశాలు ఫీజులను పెంచాలంటూ ప్రతిపాదనలు పంపాయి. హైదరాబాద్ శివార్లలోని అనేక కళాశాలలు ఫీజులను 100 శాతం పెంచాయి. గతేడాది ఇంజనీరింగ్‌లో గరిష్ఠ ఫీజు రూ.1.60 లక్షలుగా ఉండేది. ఏడాది ఫీజును రూ.2.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు చేశాయి.
ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీలను తనిఖీ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదేకాకుండా పాలిటెక్నిక్ పూర్తి చేసి ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తించనుంది. వారికీ పాత ఫీజులను వర్తిస్తాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఫీజులపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో కోర్సులన్నింటికీ ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయం
ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పాత ఫీజులే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ
బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ సహా బి-ఒకేషనల్ కోర్సులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడి pic.twitter.com/gULUNpnMvx
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2025