BigTV English

Tammudu Trailer : ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. నితిన్ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు

Tammudu Trailer : ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. నితిన్ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు

Tammudu Trailer : యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తమ్ముడు.. వకీల్ సాబ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరికెక్కుతుంది.. ఈ సినిమా తో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుండగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..


తమ్ముడు ట్రైలర్ ఎలా ఉందంటే..? 

తాజాగా విడుదలైన ట్రైలర్ ని చూస్తే.. నితిన్ తన గతం గురించి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. నాకు చిన్నప్పుడే అమ్మానాన్న లేరు. నా ఆలనా పాలన మా అక్కే దగ్గరుండి చూసుకుంది. అనుకోకుండా అక్కకు దూరమైన తమ్ముడు పడే భాధ, అక్క కోసం ఏమైనా చేసే తమ్ముడు గా నితిన్ కనిపిస్తాడు. ఒక ఊరికి కష్టం వస్తే ఆ కష్టాన్ని నితిన్ తీరుస్తాడని ట్రైలర్ లో డైలాగులు వింటే తెలుస్తుంది. కాస్త సెంటిమెంట్, అలాగే ఇంకాస్త రివెంజ్ డ్రామాగా ఈ సినిమా స్టోరీ ఉండబోతుందని ట్రైలర్ లోని సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్ అయితే సెంటిమెంట్ డైలాగులతో నిండిపోయింది. ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాలకే యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉందో మీరు ఓసారి చూసేయండి..


Also Read : విష్ణు ప్రియ- పృథ్వీ రిలేషన్ లో ఉన్నారా? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు యవ్వారం..!

ఓటీటీ పార్ట్నర్ పిక్స్..?

నితిన్ ఈ ఏడాది రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఆ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ అయినటువంటి తమ్ముడు టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఈనెల 4న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. సెంటిమెంట్ డైలాగులతో ట్రైలరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ రైట్స్ ను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ రేటుకు ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.. ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో దాన్నిబట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా అయినా నితిన్ ఖాతాలో హిట్ పడేలా చేస్తుందేమో చూడాలి..

 

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×