Telangana Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాలను నింపేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారికి ఇది గోల్డెన్ అపార్చునిటీ. సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 607
ఇందులో వివిధ స్పెషాలిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ప్రసూతి శాస్త్రం అండ్ గైనకాలజీ: 90 పోస్టులు
జనరల్ మెడిసిన్: 47 పోస్టులు
అనస్థీషియా: 44 పోస్టులు
జనరల్ సర్జరీ: 43 పోస్టులు
పీడియాట్రిక్స్: 28 పోస్టులు
ఫార్మకాలజీ: 28 పోస్టులు
ఫిజియాలజీ: 29 పోస్టులు
అనాటమీ: 22 పోస్టులు
సైకియాట్రీ: 8 పోస్టులు
పాథలజీ: 15 పోస్టులు
కమ్యూనిటీ మెడిసిన్: 25 పోస్టులు
మైక్రోబయాలజీ: 15 పోస్టులు
న్యూరాలజీ: 3 పోస్టులు
* మొత్తం 34 స్పెషాలిటీ విభాగాల్లో 607 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. (మల్టీ జోన్-1 లో 379 పోస్టులు, మల్టీ జోన్-2 లో 228 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి)
విద్యార్హత: సంబంధిత విభాగాన్ని బట్టి ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, బీఎం, ఎంసీహెచ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో నమోదు తప్పనిసరి.
వయస్సు: 2025 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 46 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగం సాధించిన వారికి భారీ జీతం ఉంటుంది. నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అవసరమైన సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు రూ.200 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ప్రైవేట్ ప్రాక్టీస్ అభ్యర్థులకు అనుమతి లేదు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 10
దరఖాస్తుకు చివరి తేది: జులై 17
అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు: 2025 జులై 18 నుంచి జులై 19 సాయంత్రం 5 గంటల వరకు
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
వెకెన్సీల సంఖ్య: 607
దరఖాస్తకు లాస్ట్ డేట్: జులై 17
ALSO READ: NAL Recruitment: సువర్ణవకాశం.. రూ.63వేల జీతంతో ఉద్యోగాలు, టెన్త్ పాసైతే చాలు