Korutla Murder Case: జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితీక్ష మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. అంతా అనుమానించినట్లుగానే.. పిన్ని మమతే.. అసూయతో ఆ చిన్నారిని క్రూరంగా హతమార్చింది. ఈ కేసులో మమతను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కి తరలించారు. ఆడుకోవడానికి వెళ్లిన బాలికను.. పక్కింట్లోకి తీసుకెళ్లి.. బాత్రూంలో హత్య చేసింది. కత్తెరతో బాలిక మెడకోసి చంపేసింది. తర్వాత.. ఏమీ తెలియనట్లు డ్రామా ఆడింది పిన్ని మమత.
బాలిక తల్లిపై ఉన్న అసూయతోనే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి సంపాదనతో పాటు బాలిక తల్లిపైన అసూయతోనే హత్య చేసినట్లు తేలింది. కొద్దిరోజులుగా.. మమత తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడి.. లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తేలింది. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు.. తోడికోడలు చిన్నచూపు చూడటంతో.. అభం శుభం తెలియని హితీక్షపై కోపం పెంచుకుంది. ఆ చిన్నారి తల్లిపై ఉన్న కక్షతోనే.. హత్య చేసినట్లు చెప్పిందని.. పోలీసులు తెలిపారు. మమత తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
తోడికోడలుపై అసూయ ఉంటే.. ఆ చిన్నారి ఏం చేసింది? అమాయకురాలైన ఆ చిన్నారిని ఎందుకు చంపింది? అనేదే.. ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. ఆ చిన్నారిని చంపండం వల్ల.. పిన్ని మమత ఏం సాధించింది? తన కక్షతో.. కోపంతో.. అసూయతో చేసిన హత్యతో.. చివరికి జైలుపాలు కావాల్సి వచ్చింది. ఆ చిన్నారిని క్రూరంగా చంపడం వల్ల.. మమత ఆర్థిక ఇబ్బందులు తీరాయా? బెట్టింగ్‌లో పోగొట్టుకున్న డబ్బులు తిరిగొచ్చాయా? ఏం మారిందని? తన కక్ష తీరడం తప్ప.. కొత్తగా మమత సాధించిందేమీ లేదు. అనవసరంగా ఆ చిన్నారి ప్రాణం తీసింది.
Also Read: ఇంటికి వచ్చి మాట్లాడి.. తర్వాత కత్తితో ఎటాక్.. స్పాట్ లోనే యువతి..
ఆ తల్లిదండ్రులకు.. తీరని శోకాన్ని మిగిల్చింది. పైగా.. ఇప్పుడు తనపై పడిన ఈ మరక.. జీవితాంతం ఆమెని వెంటాడుతూనే ఉంటుంది. ఓ చిన్నారిని హత్య చేసిందని తెలిసి.. సమాజం ఆమెని దూరం పెడితే తట్టుకోలగలదా? ఆమె అసూయే.. ఇప్పుడు ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. జైల్లో ఊచలు లెక్కపెట్టేలా చేసింది. ఆ చిన్నారి ప్రాణాన్ని తీయకపోయి ఉంటేనే.. తన మానాన తాను ఉండి ఉంటే.. ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు. కానీ.. అసూయతో ఆ చిన్నారి ప్రాణం తీసి.. ఘోరమైన పాపాన్ని మూటగట్టుకుంది మమత.