Telangana Govt Jobs: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఆయా పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. దీనిద్వారా 1284 పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది.
ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనుంది బోర్డు. సెప్టెంబరులో ఆసుపత్రులకు కొత్త ఉద్యోగులు ఎంట్రీ ఇవ్వనున్నారు. సరిగ్గా 10 నెలల కిందట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి గతేడాది సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ ఇచ్చింది మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు.
సీబీటీ విధానంలో నవంబర్ 10న పరీక్ష నిర్వహించింది. దాదాపు 24 వేల హాజరయ్యారు. అందులో 4194 మంది ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. ఆయా అభ్యర్థుల కాంట్రాక్ట్ సర్టిఫికెట్స్‌ను వెరిఫికేషన్ చేసింది బోర్డు. సర్టిఫికెట్ల ఆధారంగా అభ్యర్థులకు ఇచ్చిన వెయిటేజీపై అభ్యంతరాలు తీవ్రమయ్యాయి.
కొందరు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు బోర్డు దృష్టి వచ్చింది. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లపై ఆరా తీసేందుకు వాటిని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు పంపారు. ఈ క్రమంలో మెరిట్ లిస్ట్ జాబితా రూపొందించడంలో కాస్త ఆలస్యం అయ్యింది. చివరకు రెండు నెలల కిందట అంటే జూన్‌లో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
ALSO READ: సబార్డినేట్ సర్వీసులో 615 ఉద్యోగాలు.. పది పాసైతే చాలు
సుమారు 550 అబ్జక్షన్స్ వచ్చాయి. వెరిఫికేషన్ పూర్తి కావడంతో గురువారం( ఆగష్టు 7) ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు చివరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్, సెలక్షన్స్ పూర్తి కానున్నాయి.