E-Paper
Advertisement

Telangana Tet: తెలంగాణ టెట్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల..

Telangana Tet: తెలంగాణ టెట్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల..
Advertisement

Telangana Tet: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల అయ్యింది. మే 20న ప్రారంభమైన తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2న ముగిశాయి. మరుసటి రోజే జూన్ 3న ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్స్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఆ అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. టెట్ పేపర్ -1 కు 99,958 మంది, పేపర్ -2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ -1కు 86.03 శాతం మంది, పేపర్ -2 కు 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు జూన్ 12 విడుదల కానున్నాయి.

ఇదిలా ఉంటే, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించే విషయం విధితమే.

Advertisement

ఫలితాలను ఎలా చేసుకోవాలంటే…

1 – polycet.sbtet.telangana.gov.in లో అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి
2 – హోమ్ పేజీలో, TS POLYCET 2024 ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయాలి
3 – మీరుకొత్త వెబ్ సైట్ కి దారిమళ్లించబడుతారు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి మీ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి
4 – అప్పుడు మీ TS POLYCET ఫలితం 2024 స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది
5 – ఫలితాలకు సంబంధించిన వివరాలను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×