BigTV English

T20 World Cup 2024: ఆ రికార్డులు బద్దలవుతాయా? : ఛాలెంజ్‌గా మారిన.. టీ 20 ప్రపంచకప్

T20 World Cup 2024: ఆ రికార్డులు బద్దలవుతాయా? : ఛాలెంజ్‌గా మారిన.. టీ 20 ప్రపంచకప్

T20 World Cup 2024: క్రికెట్ అంటేనే….రికార్డుల మోత మోగుతుంటుంది. వన్డేలు, టెస్టులు, ఇందులో ఐసీసీ ప్రపంచకప్ రికార్డులు ఇలా రకరకాలుగా ఉంటాయి. అక్కడ కొట్టినా, కొట్టకపోయినా రికార్డులే ఉంటాయి. ఈ రికార్డులను వ్యతిరేకించేవారు క్రికెట్ లో నవ్వినా, ఏడ్చినా రికార్డే అని అంటుంటారు. అయితే ఎవరెలా అనుకున్నా టీ 20 ప్రపంచకప్ లో కొన్ని అసాధారణమైన రికార్డ్స్ ఉన్నాయి. మరి వాటిని ఛేదించేవారు ఈసారి ఎవరైనా ఉన్నారా? అసలు ఆ రికార్డులు ఏమిటో ఒకసారి చూద్దాం…


బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 47 వికెట్లతో నెంబర్ వన్ గా ఉన్నాడు. ఇక శ్రీలంక బౌలర్‌ అజంత మెండిస్‌ (6/8) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇక అత్యధిక జట్టు స్కోర్లలో శ్రీలంక (260/6)దే రికార్డు ఇంతవరకు నెంబర్ వన్ గా ఉంది. అలాగే అత్యల్ప రికార్డ్ నెదర్లాండ్స్‌ పేరున ఉంది. ఆ జట్టు 39 పరుగులకే ఆలౌటైంది. అత్యధికంగా క్రిస్‌ గేల్‌ రెండు సెంచరీలు చేశాడు. ఇక హాఫ్‌ సెంచరీల్లో కోహ్లీ (14) ముందంజలో ఉన్నాడు. 1141 పరుగులతో కొహ్లీ అందరికన్నా ముందున్నాడు.

ఇప్పుడు వీటిని సాధించేవాళ్లు ఎంతమంది ఉన్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ లు గెలవడం వేరు, ఆటగాళ్లు వ్యక్తిగత మైలు రాళ్లు దాటడం వేరు. ఆ రోజు తన సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోసిస్తే, ఆ విజయం ఆ క్రికెటర్ జీవితంలో చిరస్మరణీయం అవుతుంది. అందుకనే రికార్డుల కోసం ఆడే క్రికెటర్లు కొందరుంటారు. అవే క్రికెటర్లకి అలంకార ప్రాయంగా ఉంటాయి. కొందరు వద్దనుకున్నా రికార్డులు వచ్చి చేరుతుంటాయి. అలాంటివారిలో సచిన్ టెండూల్కర్, విరాట్ కొహ్లీ లాంటి వాళ్లు ముందు వరుసలో ఉంటారు.


Also Read: ఇలా అందరూ చెప్పలేరు.. కైఫ్ కీలక వ్యాఖ్యలు

మొత్తం 20 జట్లు టీ 20 ప్రపంచకప్ లో ఆడుతున్నాయి. కెనడా వర్సెస్ అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు జట్లు కూడా హోరాహోరీగా సాగాయి. అందుకని చిన్నజట్టు, పెద్ద జట్టు అని లేదు. అందరూ బ్యాట్ పట్టుకుని బేస్ బాల్ ఆడినట్టు ఆడేస్తున్నారు. అందువల్ల ఈసారి రికార్డులు ఎవరి చెంతకు చేరతాయో, ఏ చిన్న జట్టు హీరో అవుతుందో, ఏది జీరో అవుతుందో, ఎవరు ఏ రికార్డులను సృష్టిస్తారో చూడాలంటే…రోజూ ప్రపంచకప్ మ్యాచ్ లు చూడాల్సిందే.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×