Health Tips: సాధారణంగా ప్రతీ ఇంట్లో వంటకాలు తయారీలో టమాటోలు వాడుతుంటారు. టమాటోలు చేర్చడం వల్ల వంటకాల రుచి పెరుగుతుంది. అంతే కాకుండా టమాటోలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొంత మంది చర్మ సంరక్షణకు కూడా టమాటోలను వాడుతుంటారు. మరికొంతమంది వీటిని సూప్, సలాడ్‌లలో కూడా చేర్చుకుంటారు.
ఇదిలా ఉంటే.. కూరగాయలు, పప్పుల్లో టమాటోలను చేర్చడం వల్ల పుల్లటి రుచి వస్తుంది. టమాటోతో తయారు చేసిన సాస్ తినడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కూరగాయల రుచిని పెంచే టమాటా కూడా కొన్ని రకాల వంటకాల తయారీలో వాడితే రుచిని పాడు చేస్తుందని మీకు తెలుసా ? మరి ఎలాంటి వంటకాల తయారీలో టమాటోలను ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్ల కాయ:
అధికంగా పోషకాలు ఉండే పొట్ల కాయతో తయారు చేసే కూరల్లో టమాటోలు అస్సలు కలపకూడదు. ఇలా చేస్తే వంటకం యొక్క రుచి పూర్తిగా మారుతుంది. అంతే కాకుండా వంటకం కూడా జిగటగా మారుతుంది. అందుకే పొరపాటున కూడా పొట్లకాయలో టమాటోను కలపకండి.
పచ్చి ఆకుకూరలు:
ఆకు కూరల్లో టమాటోలను వాడకూడదు. బచ్చలికూర, మెంతి కూర, మొదలైన ఆకు కూరలతో తయారు చేసిన కూరల్లో టమాటోలను వాడకూడదు. ఆకు కూరలు తయారు చేసేటప్పుడు అవి నీటిని విడుదల చేస్తాయి. ఇలాంటి సమయంలో మీరు టమాటోను కూడా వాడితే.. తినేటప్పుడు కూర అంత రుచిగా ఉండదు.
బెండకాయ:
బెండకాయను వండేటప్పుడు టమాటోనే వాడకూడదు. బెండకాయ కూరలో టమాటో వేసి వండితే.. అది మరింత జిగటగా మారుతుంది. టమాటో యొక్క పులుపు గుణం బెండకాయ కూర టేస్ట్ పూర్తిగా మార్చేస్తుంది. టమాటో వాడటం వల్ల కర్రీ రుచి మెరుగుపడదు