Amazon Jobs: డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అమెజాన్ సంస్థలో పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా, కోచి, ముంబై, ఉత్తరప్రదేశ్ , గుర్గాన్ వంటి పట్టణాల్లో ఉన్న అమెజాన్ సంస్థ కార్యాలయాల్లో పనిచేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు అమెజాన్ సంస్థలో ఇంటి నుంచే పని చేేయవచ్చు. నోటిఫికేషన్‌కు సంబందించి వివరాలను డీటైయిల్డ్‌గా చూద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: ఉద్యోగాల సంఖ్య గురించి తెలపలేదు.
ఇందులో MyHR Live Support Advisor అనే ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
అప్లికేషన్ విధానం: ఆన్ లైన్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగానికి కావాల్సినవి: ఇంగ్లిష్ నాలెడ్జ్ అండ్ రైటింగ్ స్కిల్స్ చూస్తారు. ఉద్యోగానికి సెలెక్ట్ అభ్యర్థులు 50-100 Mbps వేగం పరిధితో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
వయస్సు: 18 సంవత్సరాలు పైబడిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎక్స్ పీరియన్స్: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు కూడా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.41,600 వేతనం లభిస్తుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 25
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హత, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
Also Read: Central Bank of India Jobs: జస్ట్ డిగ్రీ పాసై ఉంటే చాలు.. అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.86,000
అప్లికేషన్ లింక్: https://www.amazon.jobs/en/jobs/2868479/myhr-live-support-advisor-s-mhls
అర్హతలున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఇది మంచి అవకాశం. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.