E-Paper
Advertisement

TG ECET 2026: టీజీ ఈసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. దరఖాస్తు తేదీలు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడంటే..?

TG ECET 2026: టీజీ ఈసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. దరఖాస్తు తేదీలు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడంటే..?
Advertisement

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా సెకండియర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈసెట్‌ (TG ECET) – 2026 షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది కూడా పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తు ప్రక్రియ, ముఖ్య తేదీల వివరాలు.. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిప్లొమా పూర్తి చేసిన వారు, అలాగే బీ.ఎస్సీ (Maths) ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Advertisement

దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 9, 2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.

చివరి తేదీ: ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

పరీక్ష తేదీ: మే 15వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) పరీక్ష జరుగుతుంది.

నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కూడా అభ్యర్థులు అదనపు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఉన్నత విద్యామండలి కల్పించింది.

ఫీజు వివరాలు ఇవే.. 

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు (PH): రూ. 500

ఇతర అభ్యర్థులకు (General/OBC): రూ. 900/

ఈ ప్రవేశ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ (CBT) విధానంలో జరుగుతుంది. ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఆయా కోర్ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి.

అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి స్థాయి సిలబస్, పరీక్షా కేంద్రాలు మరియు ఇతర సందేహాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ecet.tgche.ac.in ను సంప్రదించవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం.

ALSO READ: PMGDISHA Telangana: డిజిటల్ దిశగా తెలంగాణ.. రాష్ట్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 12.10 లక్షల మంది లబ్ధిదారులు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×