E-Paper
Advertisement

PMGDISHA Telangana: డిజిటల్ దిశగా తెలంగాణ.. రాష్ట్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 12.10 లక్షల మంది లబ్ధిదారులు.

PMGDISHA Telangana: డిజిటల్ దిశగా తెలంగాణ.. రాష్ట్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 12.10 లక్షల మంది లబ్ధిదారులు.
Advertisement

PMGDISHA Telangana: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌’ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం డిజిటల్‌ సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందుతున్నారు. ఇటీవలే పార్లమెంట్‌లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ పథకానికి సంబంధించిన గణాంకాలను వెల్లడించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 14,56,226 మంది ఈ పథకం కింద తమ పేర్లను నమోదు చేసుకోగా, వారిలో 12,10,448 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ శిక్షణలో మహిళల భాగస్వామ్యం ఆశాజనకంగా ఉంది. మొత్తం 8,90,182 మంది మహిళలు నమోదు చేసుకోగా, వారిలో 7,63,651 మంది డిజిటల్ అక్షరాస్యతను సాధించారు. పురుషుల విషయానికి వస్తే 5,60,022 మంది నమోదు కాగా, 4,46,777 మంది కోర్సును పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన లబ్ధిదారులు ఇప్పుడు సొంతంగా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుంటూ, డిజిటల్ లావాదేవీలను సులభంగా నిర్వహించగలుగుతున్నారు.

Advertisement

దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 6.39 కోట్ల మందికి ఈ పథకం ద్వారా శిక్షణ అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో PMGDISHA కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల వాడకం నుంచి ప్రభుత్వ ఈ-సేవలను పొందడం వరకు ఈ శిక్షణ లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో నమోదవుతున్న ఈ పురోగతి, భవిష్యత్తులో పూర్తిస్థాయి డిజిటల్ సమాజ నిర్మాణానికి బలమైన పునాదిగా మారుతోంది.

Read Also: Harish Rao: రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×