BigTV English

TGPSC: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచి..

TGPSC: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచి..

TGPSC Group 1: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను జూన్ 24న సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబోతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్ సైట్ లో తమ వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవొచ్చని సూచించింది.


కాగా, ఇటీవల నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 4,03,667 అప్లికేషన్లు వచ్చాయని, 3,02,172 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపింది. ఇదిలా ఉంటే.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ జూన్ 13న విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే జూన్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.

Also Read: గ్రూప్ -2 అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం


అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి 4.03 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Tags

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×