AAI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లో 197 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 11న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 197
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నికల్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు:
సివిల్: 7 పోస్టులు
ఎలక్ట్రికల్: 6 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ : 6 పోస్టులు
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 2 పోస్టులు
మెకానికల్/ ఆటోమొబైల్ : 3 పోస్టులు
బీసీఏ: 9 పోస్టులు
టెక్నికల్ అప్రెంటీస్ పోస్టులు:
సివిల్ : 26 పోస్టులు
ఎలక్ట్రికల్: 25 పోస్టులు
ఎలక్ట్రానిక్స్: 23 పోస్టులు
కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : 6 పోస్టులు
మెకానికల్/ ఆటోమొబైల్స్ : 6 పోస్టులు
కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినిస్ మేనేజ్ మెంట్: 10 పోస్టులు
ట్రేడ్ అప్రెంటీస్:
కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 60 పోస్టులు
స్టెనో: 8 పోస్టులు
విద్యార్హత: డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: జులై 11
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 11
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: త్వరలో తెలియజేయనున్నారు.
జీతం: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రూ.15వేల జీతం ఉంటుంది. టెక్నికల్ అప్రెంటీస్ పోస్టులకు రూ.12వేల జీతం ఉంటుంది. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు రూ.9వేల జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://aai.aero/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 197
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 11
ALSO READ: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?