BigTV English

Samosa: సమోసాలు ఎందుకు డేంజర్? ప్రభుత్వం ఎందుకు అలర్ట్ ప్రకటించింది?

Samosa: సమోసాలు ఎందుకు డేంజర్? ప్రభుత్వం ఎందుకు అలర్ట్ ప్రకటించింది?

సిగరెట్ పెట్టెలను చూడండి… ఆ పెట్టెలపై ధూమపానం హానికరం అని రాసి ఉంటుంది. ఇక పైన మీరు జిలేబీలు, పకోడీలు, వడాపావ్, సమోసాలు ఏది కొన్నా కూడా అవి అమ్మే చోట ఇకపై ఇలాంటి హెచ్చరిక బోర్డులే కనిపించబోతున్నాయి. దేశంలోనే తొలిసారి దీన్ని నాగపూర్ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టబోతున్నారు. అక్కడ ఉన్న క్యాంపస్ లోని అన్ని క్యాంటీన్, ఫుడ్ కౌంటర్లలో సమోసాలు, జిలేబీలు, వడా పావ్ అమ్మే చోట ఆరోగ్య హెచ్చరికలు కనిపిస్తాయి. భారీ పోస్టర్లు హెచ్చరిక బోర్డులు పెట్టబోతున్నారు.


సమోసాలు దగ్గర హెచ్చరిక బోర్డులు
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్నాక్స్ గా సమోసాలు, జిలేబీలు పేరు తెచ్చుకున్నాయి. ఎక్కడైనా కూడా భారతదేశంలోని ఏ మూలకి వెళ్ళినా సమోసాలు, జిలేబీలు దొరుకుతాయి. అన్ని రకాల క్యాంటీన్లలో కూడా ఈ రెండింటినీ పెడతారు. ఈ రెండింటి లైఫ్ టైం కూడా ఎక్కువ. కాబట్టి ఒకసారి వండితే నిల్వ ఉంటాయనే ఉద్దేశం ఉంటుంది. అయితే వీటిని తినడం ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. అందుకే వీటిని కూడా తినడం మంచిది కాదనే హెచ్చరిక బోర్డులు ఇకపై రాబోతున్నాయి.

వడపావ్, సమోసాలు, జిలేబీలు, పకోడీలు, టీ బిస్కెట్లు వంటి వాటిలో అధిక కొవ్వు, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఇవి అమ్మే చోట అవన్నీ ఎంతెంత ఉన్నాయో హెచ్చరిక బోర్డుల రూపంలో పెట్టబోతున్నారు.


ఎందుకు సమోసా తినకూడదు?
సమోసాలు, జిలేబీలలో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. కానీ అవి ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. సమోసాలు, బంగాళదుంపలు, పప్పులతోనే చేస్తారు కదా అనుకోవచ్చు. కానీ లోపల స్టఫ్ఫింగ్ కాకుండా బయట ఉండే సమోసా పొరలు మైదాపిండితో తయారుచేస్తారు. దీనిలో అధిక క్యాలరీలు ఉంటాయి. అనారోగ్యమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఈ మైదా పిండిని ఎప్పుడు అయితే డీప్ ఫ్రై చేస్తారో అందులో మరింతగా ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోతాయి. అదే విధంగా జిలేబీలు డీప్ ఫ్రై చేసి చక్కెర సిరప్ లో నానబెట్టాక… అవి ట్రాన్స్ ఫ్యాట్స్ తో నిండిపోతాయి. అలాంటి ఆహారాన్ని తరచూ తింటే జీవనశైలి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

ఈ సమోసాలు, జిలేబీలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటిలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటివి దొరకవు. అంతేకాదు ఈ సమోసాలు, జిలేబిలలో ఒకటి తిన్నాక తృప్తి చెందలేము. మరింతగా తినాలనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఊబకాయం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

సమోసాలు, జిలేబిలు తరచూ తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వీటిలో అధిక కొవ్వు ఉంటుంది. అలాగే చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ కంటెంట్ అధికంగా ఉంటాయి. కాబట్టి కొన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరిగిపోతుంది.

గుండె పోటు వచ్చే అవకాశం
సమోసాలు, జిలేబీలలో అధిక స్థాయిలో ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరిగిపోతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల గుండె సమస్యలు బారిన పడే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

డయాబెటిస్
మైదాతో చేసిన జిలేబిలు, సమోసాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది శరీరంలోని ఇన్సులిన్ ప్రతిస్పందన పై ఒత్తిడి కలిగిస్తుంది. క్రమం తప్పకుండా ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. చివరకు టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు. మనదేశంలో లక్షలాది మంది డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. అధిక చక్కెర కొవ్వు కలయిక డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచేస్తుంది.

బరువు పెరుగుతారు
సమోసాలు, జిలేబీలలో కేలరీల సాంద్రత ఎక్కువ. పోషక విలువలు తక్కువ. కాబట్టి త్వరగా బరువు పెరిగేస్తారు. బరువు పెరిగారంటే మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల సమస్యలు వంటివి రావడానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే కొవ్వు కాలేయ వ్యాధి, జీవక్రియ సిండ్రోమ్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సమోసాలు, జిలేబిలు, వడాపావ్, పకోడీలు, టీ బిస్కెట్లు వంటి వాటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×