BigTV English

Star Heroine: మూడు తరాలను కవర్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?

Star Heroine: మూడు తరాలను కవర్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?

Star Heroine:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. నిజానికి ఒకప్పటిలాగా హీరోయిన్ల కెరియర్ ఇప్పుడు పట్టుమని పదేళ్లు కూడా ఉండడం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడమంటే రెండు, మూడు చిత్రాలు ప్లాపులు పడ్డాయి అంటే.. ఇక వారిని మాట్లాడే దర్శకులు కూడా ఉండరు. ఒకవేళ అవకాశాల కోసం కక్కుర్తి పడి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేశారు అంటే.. ఇక భవిష్యత్తులో వారికి హీరోయిన్గా అవకాశాలు రావేమో అనే భయం కూడా చుట్టుకుంటుంది. తద్వారా హీరోయిన్ల పరిస్థితి ఇప్పుడు దాదాపుగా అయోమయంలో పడిపోయిందని చెప్పాలి. అందుకే కథ ఎంచుకునేటప్పుడే ఆ హీరోయిన్లు ఆచితూచి మరీ అడుగులు వేస్తున్నారు


మూడు తరాలను చుట్టేసిన ఏకైక హీరోయిన్..

ఇకపోతే ప్రస్తుత హీరోయిన్ల పరిస్థితి ఇలా ఉండగా.. అప్పటి కాలంలో ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా మూడు తరాలను చుట్టేసింది. ముఖ్యంగా తాత, తండ్రి, మనవడు ఇలా మూడు తరాలను చుట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇప్పటికీ కూడా ఆమె ఇండస్ట్రీలో అంతే యాక్టివ్గా దూసుకుపోతూ.. తన పెర్ఫార్మన్స్ తో అలరిస్తోంది. ఇక అంతేకాదు ఆ మూడు తరాల హీరోలతో నటించిన ఏకైక నటిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ (Ramya Krishnan). నరసింహ సినిమాలో నీలాంబరిగా, బాహుబలి సినిమాలో శివగామిగా ఇలా పలు పాత్రలతో తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. 1984లో ‘కంచు కాగడా’ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. అంతేకాదు అప్పటి స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.


అక్కినేని నాగేశ్వరరావు – రమ్యకృష్ణ కాంబినేషన్లో సినిమాలు..

ఇక దాదాపు 15 సంవత్సరాలు పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత కూడా హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్ ఇలా అప్పటి హీరోలు అందరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈమె పేరుపైనే ఆ రికార్డు క్రియేట్ అయింది. మూడు తరాల హీరోలతో నటించిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ఆ రికార్డు విషయానికి వస్తే.. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) మొదలుకొని అఖిల్ (Akhil) వరకు ఇలా మూడు తరాలతో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తో సూత్రధారులు, దాగుడుమూతల దాంపత్యం, ఇద్దరే ఇద్దరు వంటి పలు చిత్రాలలో నటించింది..

నాగార్జున – రమ్యకృష్ణ కాంబో మూవీలు..

ఇక అక్కినేని నాగార్జున (Nagarjuna ) విషయానికి వస్తే.. నాగార్జున – రమ్యకృష్ణ లది వెండితెరపై సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో చంద్రలేఖ, హలో బ్రదర్, సంకీర్తన, అన్నమయ్య, అల్లరి అల్లుడు ఇలా దాదాపు పదికి పైగా చిత్రాలు వచ్చాయి. ఇక ఈమె నాగేశ్వరరావు, నాగార్జున తోనే కాదు..

నాగార్జున వారసులతో కూడా..

నాగార్జున వారసులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil)తో కూడా నటించారు. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నాగచైతన్యకు అత్తగా నటించింది. అలాగే బంగార్రాజు సినిమాలో నానమ్మగా కూడా నటించింది. అఖిల్ తో హలో సినిమాలో అఖిల్ తల్లిగా నటించింది. ఇలా మూడు తరాల హీరోలతో కలిసి రమ్యకృష్ణ సినిమాలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ALSO READ:Janaki Vs Kerala: ఇదెక్కడి విడ్డూరమయ్యా.. ఏకంగా టైటిల్నే మార్చమన్న సెన్సార్!

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×