BigTV English

FOREST BEAT OFFICER: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. ఇవ్వి చదివితే చాలు.. ఉద్యోగం మీ సొంతం!

FOREST BEAT OFFICER: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. ఇవ్వి చదివితే చాలు.. ఉద్యోగం మీ సొంతం!

Forest Beat Officer: ఏపీలో పారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 691 ఉద్యోగాలకు గానూ ఏపీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఈ ఎగ్జామ్ సెప్టెంబర్ 7న ఉంటుంది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


అయితే ఈ ఉద్యోగం సాధించాలంటే ఏం చదవాలి..? ఎందులో నుంచి మార్కులు ఎక్కువ వస్తాయి..? వాకింగ్ టెస్ట్ ఎన్ని గంట్లలో పూర్తి చేయాలి..? సెలెక్ట్ అయితే జీతం ఎంతవరకు వస్తుంది.. అనే విషయాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం..

శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులకు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలకు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. NCC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తింపజేస్తారు.


ఎగ్జామ్ విధానం…

స్ర్కీనింగ్ నింగ్ టెస్ట్, వాకింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు..

స్క్రీనింగ్ టెస్ట్: సెప్టెంబర్ 7

నోట్: స్ర్కీనింగ్ టెస్ట్ పాసైన వారికి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ పాసైన వారికి మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారు ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు.

వాకింగ్ టెస్ట్:

పురుషులు: 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడవాల్సి ఉటుంది.

మహిళలు: 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ (టెన్త్ స్టాండర్డ్) నుంచి 75 ప్రశ్నలు వస్తాయి.. (మెయిన్స్ కి కూడా ఇదే ఎగ్జామ్ ఉంటుంది. కానీ పేపర్ 1 లో 100 ప్రశ్నలకు గానూ 100 మార్కులు, పేపర్ -2లో 100 ప్రశ్నలకు గానూ 100 మార్కులకు నిర్వహిస్తారు.)

అయితే.. ఈ ఎగ్జామ్ కు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంది. ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం పెడితే.. 1/3 మార్కు చొప్పున నెగిటివ్ మార్కింగ్ గా ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ రాయితే.. మూడో వంతు చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. (స్క్రీనింగ్, మెయిన్స్ రెండు ఎగ్జామ్ లకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.)

జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.. (టెన్త్ స్టాండర్డ్)

కరెంట్ అఫైర్స్: జాతీయ, రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎగ్జా్మ్ లో అడుగుతారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన పథకాల గురించి చదవండి. ఎగ్జామ్ కు ముందు ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. అంతకుముందు ఆరు నెలలు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది.

ఇండియన్ హిస్టరీ: ఇండియన్ హిస్టరీ నుంచి మూడు, నాలుగు ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్- 1885 నుంచి బాగా చదవండి. ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది.

జాగ్రఫీ: ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ.. నుంచి మూడు, నాలుగు ప్రశ్నలు రావొచ్చు..

పాలిటీ: ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రపతి, ముఖ్యమైన ఆర్టికల్స్ చదవండి. నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు రావొచ్చు..

పర్యావరణ- సుస్థిరాభివృద్ధి: మూడు నుంచి నాలుగు ప్రశ్నలు రావొచ్చు.

డిజాస్టర్ మేనేజ్ మెంట్: భూకంపాలు, సైక్లోన్స్, సునామీ, వరదలు.. ఇలాంటి వాటి నుంచి రెండు, మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

అర్థమెటిక్: నంబర్ సిస్టెమ్స్, రేషనల్ అండ్ రియల్ నంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ స్ట్రక్షన్, మల్టిపికేషన్, డివిజన్, స్క్వాయర్ రూట్, టైమ్ అండ్ డిస్టాన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సెంటీజీస్, అప్లికేషన్స్ టు సింప్లిఫికేషన్, కసాగు, గసాభా, లాగరథిమ్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

రీజనింగ్: అనాలజీ, కోడింగ్- డీ కోడింగ్, రక్త సంబంధాలు, నంబర్ పాయింట్ అవుట్, డైరక్షన్ అండ్ డిస్టాన్స్, మ్యాథమెటిక్ ఆపరేషన్స్, క్యాలెండర్, క్లాక్, సీటింగ్ ఆరెంజ్ మెంట్, నంబర్ సిరీస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు..

ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు వాకింగ్ టెస్ట్ ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది.

మెయిన్స్ ఎగ్జామ్‌లో: క్వాలిఫైయింగ్ టెస్ట్, పేపర్ -1, పేపర్ -2 ఉంటాయి.

క్వాలిఫైయింగ్ టెస్ట్: 50 మార్కులకు ఎస్సై రైటింగ్ ఉంటుంది.

పేపర్ 1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ: 100 ప్రశ్నలకు గానూ 100 మార్కులు

పేపర్ 2: జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ : 100 ప్రశ్నలకు గానూ 100 మార్కులు

*పేపర్ 1, పేపర్ 2 లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు..

జీతం వివరాలు..

ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది..

బీట్ ఆఫీసర్: రూ.25,220 నుంచి రూ.80,910

అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 23,120 నుంచి రూ.74,770

ALSO READ: Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..!

Related News

Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..!

Indian Navy: ఇండియన్ నేవీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.63వేల జీతం.. దరఖాస్తుకు ఒక్కరోజే గడువు

BHEL Recruitment: భారీ గుడ్‌న్యూస్.. బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం

Big Stories

×