OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలను చూస్తున్నప్పుడు మరో ప్రపంచంలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అందులోను ఏలియన్ కాన్సెప్ట్ సినిమాలు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. అయితే ఇప్పుడు మనం చెపుకోబోయే సైన్స్ ఫిక్షన్ సినిమా కామెడీ జానర్ లో వచ్చింది. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్‌లో $1.033 బిలియన్ వసూలు చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. రీసెంట్ గా ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. ఈ స్టోరీ ఒక కుక్క రూపంలో ఉండే ఒక ఏలియన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
హవాయిలోని కవాయ్ దీవిలో, 6 ఏళ్ల లిలో తల్లిదండ్రుల మరణం తర్వాత బాధపడుతుంటుంది. ఆ తరువాత ఆమె స్కూల్, సమాజంలో సరిగ్గా ఇమడలేకపోతుంది. ఆమె అక్క నానీ కాలేజీ స్కాలర్‌షిప్‌ను కూడా వదులుకొని, లిలోను సంరక్షిస్తూ, సోషల్ వర్కర్ మిసెస్ కేకోవా ఒత్తిడితో ఆర్థికంగా పోరాడుతుంది. ఈ సమయంలో లిలో ఒక యానిమల్ షెల్టర్‌లో వింతైన స్టిచ్ అనే నీలి రంగు కుక్కను చూసి, దానిని అడాప్ట్ చేసుకుంటుంది. అది నిజానికి డాక్టర్ జుంబా జూకిబా సృష్టించిన ఎక్స్‌పెరిమెంట్ 626. ఒక విధ్వంసకరమైన అగ్రెసివ్ ఏలియన్. ఈ డాక్టర్ బృందం, యునైటెడ్ గెలాక్టిక్ ఫెడరేషన్ తరపున స్టిచ్‌ను పట్టుకోవడానికి వస్తారు.
ఇప్పుడు లిలో, స్టిచ్‌తో బంధం పెంచుకుంటూ దానితో సరదాగా గడుపుతుంటుంది. స్టిచ్‌ను పట్టుకోవడానికి జుంబా, ప్లీక్లీ, గ్రాండ్ కౌన్సిల్‌వుమన్ అనే తన టీంతో కలిసి వస్తాడు. వీళ్ళంతా లిలో, నానీ జీవితాలను గందరగోళం చేస్తారు. జుంబా ఇక్కడ ఒక విలన్‌గా మారతాడు. లిలో, స్టిచ్‌ను బంధించి ఒక దిక్కుమాలిన స్పీచ్ ఇస్తాడు. ఇక క్లైమాక్స్‌లో, లిలో, స్టిచ్, నానీ కలసి జుంబాను ఎదుర్కొంటారు. మరి వీళ్ళంతా స్టిచ్ ను కాపాడతారా ? జుంబా చేతిలో స్టిచ్ బలవుతుందా ? ఆ ఏలియన్ ఎక్కడినుంచి వచ్చింది ? అనే విషయాలను ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసి తెలుసుకోండి.
ఎందులో స్ట్రీమింగ్ అంటే
‘లిలో & స్టిచ్’ (Lilo & Stitch) 2025లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్. డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వంలో, 2002 లో వచ్చిన డిస్నీ యానిమేటెడ్ ఫిల్మ్ లైవ్-యాక్షన్ రీమేక్‌గా రూపొందింది. ఇందులో మాయా కీలోహా (లిలో), సిడ్నీ ఎలిజబెత్ అగుడాంగ్ (నానీ), క్రిస్ శాండర్స్ (స్టిచ్ వాయిస్), బిల్లీ మాగ్నస్సెన్ (ప్లీక్లీ), జాక్ గాలిఫియానకిస్ (జుంబా), కోర్ట్నీ బి. వాన్స్ (కోబ్రా బబుల్స్), హన్నా వాడింగ్‌హామ్ (గ్రాండ్ కౌన్సిల్‌వుమన్) నటించారు. ఈ సినిమా 2025 మే 23న థియేటర్లలో విడుదలై, 1 గంట 48 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.8/10 రేటింగ్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే, యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : రాత్రయితే క్రూరంగా మారే ముసలి భర్త… మొగుడి కళ్లు గప్పి పెయింటర్ తో యవ్వారం… ఈ మూవీ పెద్దలకు మాత్రమే