UCO Bank Jobs 2025 : యునైటెడ్ కంబైన్డ్ ఆఫీసర్స్ (UCO) బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
UCO బ్యాంక్ ucobank.com అధికారిక వెబ్‌సైట్‌ను ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . UCO బ్యాంక్‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 16 జనవరి 2025 నుండి ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 5 ఫిబ్రవరి 2025.
మొత్తం ఖాళీల సంఖ్య : 250
రాష్ట్రాల వారిగా పోస్టులు..
గుజరాత్: 57 పోస్టులు
మహారాష్ట్ర: 70 పోస్టులు
అస్సాం: 30 పోస్టులు
కర్ణాటక: 35 పోస్టులు
త్రిపుర: 13 పోస్టులు
సిక్కిం: 6 పోస్టులు
నాగాలాండ్: 5 పోస్టులు
మేఘాలయ: 4 పోస్టులు
కేరళ: 15 పోస్టులు
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్: 10 పోస్టులు
జమ్మూ కాశ్మీర్: 5 పోస్టులు
అర్హత:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయస్సు:
అభ్యర్థులు వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లై చేసుకోవడానికి ఫీజు:
SC/ST/PwBD అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. ఇతర అభ్యర్థులందరూ రూ. 850 చెల్లించాలి.
Also Read: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. 4 నెలలు ఉచిత శిక్షణ
అప్లై చేసుకునే విధానం:
ముందుగా UCO బ్యాంక్ ucobank.com అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
వెబ్‌సైట్ హోమ్‌పేజీలో “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” లేదా “రిక్రూట్‌మెంట్” లింక్‌పై క్లిక్ చేయండి.
అప్లికేషన్ పూర్తి చేయండి. తర్వాత అవసరమైన సర్టిఫికెట్స్ పీడీఎఫ్ అప్‌లోడ్ చేయండి.
తర్వాత ఫీజు చెల్లించండి.
చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.