దేశంలో ప్రస్తుతం జియో, ఎయిర్ టెల్ దిగ్గజ టెలికాం సంస్థలుగా కొనసాగుతున్నాయి. జియో 49 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్ లను కలిగి ఉండగా, ఎయిర్ టెల్ 38 కోట్ల సబ్ స్క్రైబర్ లను కలిగి ఉంది. ఈ రెండు సర్వీస్ ప్రొవైడర్లు తమ కస్టమర్లను ఆకట్టుకునేలా పలు రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అంతేకాదు, రెండు కంపెనీలు అంబాటులోకి తీసుకొచ్చిన ప్లాన్స్ ఇంచుమించు ఒకేలా ఉంటున్నాయి. అయితే, ఈ రెండు కంపెనీల అందించే రూ. 500 లోపు ప్లాన్‌లను పోల్చి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏ ప్లాస్ బెస్ట్ అనేది తెలుసుకుందాం..
రూ. 500లోపు జియో ఫ్లాన్స్
⦿జియో రూ. 449 ప్లాన్
హై-స్పీడ్ డేటాను కోరుకునే వినియోగదారులకు ఈ ప్యాకేజీ అనువైనది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ 3GB డేటా లభిసతుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కాలింగ్ కు ఉచిత మెంబర్ షిప్ పొందే అవకాశం ఉంటుంది. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.
⦿జియో రూ. 448 ప్లాన్
వినోదం పొందాలనుకునే వారికి ఈ ప్యాకేజీ అద్భుతమైన ఎంపిక. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 56 GB డేటా లభిస్తుంది. ప్రతి రోజు 2 GB డేటా వాడుకోవచ్చు. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. జియో సినిమా ప్రీమియం, జియో టీవీ, సోనీ లివ్, జీ5, సన్ NXT లాంటి 12 OTT అప్లికేషన్లకు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
⦿జియో రూ. 399 ప్లాన్
28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రోజూ 2.5 GB డేటా పొందే అవకాశం ఉంటుంది. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా యాక్సెస్ పొందవచ్చు.
⦿జియో రూ. 399 నెలవారీ క్యాలెండర్ ప్లాన్
ఈ ప్లాన్ ప్రకారం క్యాలెండర్‌లో ఒక నెల ఉపయోగించుకోవచ్చు. ప్రతి రోజు 1.5GB డేటా లభిస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు అపరిమితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా సబ్ స్క్రిప్షన్ ప్రీగా పొందే అవకాశం ఉంటుంది.
రూ. 500 లోపు ఎయిర్ టెల్ ఫ్లాన్స్
⦿ఎయిర్ టెల్ రూ. 489 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులు ఉంటుంది. మొత్తం డేటా 6 GB లభిస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ఎయిర్ టెల్ రూ. 449 ప్లాన్
ఎక్కువ డేటా వినియోగించే వారి కోసం ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 3 GB డేటా లభిస్తుంది. ఎయిర్ టెల్ స్ట్రీమ్ ప్లే ప్రీమియంతో 22 OTT యాప్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ఎయిర్‌టెల్ రూ. 429 ప్లాన్
ఇది క్యాలెండర్ లో ఒక నెల పాలు వ్యాలిడిటీ ఉంటుంది. రోజూ 2.5 GB డేటా లభిస్తుంది. అన్ని నెట్ వర్క్ లలో అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿రూ.355 ఎయిర్ టెల్ ప్లాన్
30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం డేటా 25 GB లభిస్తుంది. ఉచిత SMS, అపరిమిత ఉచిత ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలంటే?
ఎక్కువ డేటా వినియోగదారులు జియో, ఎయిర్ టెల్ రూ. 449 టారిఫ్‌లు తీసుకుంటే బెస్ట్. దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోసం ఎయిర్ టెల్ రూ. 489 ప్యాకేజీ తీసుకోవాలి. OTT సబ్ స్క్రిప్షన్లు కోరుకుంటే జియో రూ. 448 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: 5Gకి, జియో 5.5కి తేడా ఏంటి? ప్రస్తుతం ఉన్న మొబైల్స్ కు పని చేస్తుందా?