Manchu Vishnu: మంచు బ్రదర్స్ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. మోహన్ బాబు కుటుంబం రోడ్డున పడ్డ విషయం అందరికీ తెల్సిందే. ఆస్తి తగాదాలతో మంచు బ్రదర్స్ రోడ్డెక్కారు. మంచు మనోజ్ ను విష్ణు, మోహన్ బాబు గెంటేశారు. మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా ఎప్పటికప్పుడు తండ్రీకొడుకులు అడ్డుకుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మనోజ్ కూతురును అడ్డుపెట్టుకొని కథ నడిపించిన విష్ణు.. ఇప్పుడు పండగ రోజు తమ్ముడు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేసి మరోసారి హీట్ పెంచాడు.
కనుమ నాడు మనోజ్.. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లి గొడవ చేసిన విషయం విదితమే. లోపలికి వెళ్లి పెద్దల సమాధులకు మొక్కి వచ్చేస్తాం అన్నా వినకుండా మోహన్ బాబు తరపు రౌడీ మూకలు మంచు మనోజ్ కారుపై దాడి చేశారు. దాంతో డెయిరీ ఫార్మ్ గేటు వద్ద ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు.. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్.. విష్ణు బౌన్సర్లపై కేసు పెట్టాగా.. మోహన్ బాబు.. మనోజ్, మౌనికలపై కేసు పెట్టాడు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు.
ఇదంతా పక్కన పెడితే.. మనోజ్ – విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మనోజ్.. మీడియా ముందే తన అన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. నా అన్న విష్ణు నన్ను, నా కుటుంబాన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని, ఇప్పటికే జనరేటర్ లో పంచదార వేసి చంపాలని చూశాడని ఫిర్యాదు కూడా చేశాడు. అంతేకాకుండా మోహన్ బాబును వెనుక నుంచి నడిపించేది విష్ణునే అని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలపై విష్ణు ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడు. కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ డైలాగ్ ను వాడి.. తెలివిగా తప్పించుకున్నాడు.
మోహన్ బాబు నట ప్రస్థానానికి 50 ఏళ్లు ముగిసాయి. సోషల్ మీడియాలో గత కొన్నిరోజుల నుంచి మోహన్ బాబు తనకు నచ్చిన సినిమాల్లోని డైలాగ్ ను పోస్ట్ చేస్తూ తన మనోభావాలను చెప్పుకుంటూ వస్తున్నాడు. తాజాగా విష్ణు ఇప్పుడు అదే ఫాలో అయ్యాడు. మోహన్ బాబు, విష్ణు కలిసి నటించిన రౌడీలోని ఒక ఫేమస్ డైలాగ్ ను కట్ చేసి పోస్ట్ చేశాడు.
“సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ, వీధి లో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ” అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను పోస్ట్ చేశాడు. అంటే మనోజ్ కుక్క.. విష్ణు సింహం అని చెప్పకనే చెప్పాడు. రోడ్డుపై వచ్చి అరిస్తే ఏమి కాదని, తాను సింహం అని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడు.
ఇక దీనికి క్యాప్షన్ గా .. ” నాకు ఇష్టమైన రౌడీ సినిమా నుంచి ఒక మంచి డైలాగ్. ఆర్జీవీ సినిమాలో ఈ సినిమా నాకు ఫేవరేట్. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులోని ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టావో అందరికీ తెలుసులే అని కామెంట్స్ పెడుతున్నారు.
One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM
— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025