Jobs Notifications: ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నారా.. ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు అనుకుంటున్నారా.. ఆ సమయం రానే వచ్చింది, కేంద్రం ఏకంగా లక్షకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది. ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు సుమా. ఇంతకు ఆ ఉద్యోగాలు ఏమిటి? పూర్తి విషయాలు తెలుసుకుందాం.
కేంద్ర హోం శాఖ పరిధిలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ నోటికేషన్స్ వెలువడనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటించారు. అతి త్వరలో 100204 ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాబ్ రావాలనే ఆశతో స్వగ్రామాలకు కూడా దూరమై అభ్యర్థులు శిక్షణ కేంద్రాల బాట పట్టారు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం భద్రతా బలగాలలో ఖాళీగా ఉన్న జాబ్స్ భర్తీ చేసే చర్యలను ప్రారంభించింది.
ఇక కేంద్ర మంత్రి తెలిపిన వివరాల మేరకు.. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ లో 100204 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో సీఆర్పీఎస్ – 33730, సీఐఎస్ఎఫ్ – 31782, బీఎస్ఎఫ్ – 12808, ఐటీబీపీ – 9861, ఎస్ఎస్బీ – 8646, అస్సాం రైఫిల్స్ లో – 3377 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను యూపీఎస్సీ, ఎస్ఎస్సీ ద్వారా అతి త్వరలో భర్తీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేయాలని కేంద్రం సంబంధిత అధికారులను ఆదేశించింది.
Also Read: Long Hair Tips: ఇవి వాడితే.. మీ జుట్టు అస్సలు రాలదు తెలుసా ?
అలాగే ఈ నోటిఫికేషన్స్ గురించి కేంద్రం మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఈ పోస్టులను భర్తీ చేసే సమయంలో వైద్య పరీక్షల సమయం తగ్గించి, కానిస్టేబుల్ జీడీ పోస్టులకు కటాఫ్ మార్కులను కూడా తగ్గించనున్నట్లు చెప్పడంతో అభ్యర్థులకు శుభవార్తగా చెప్పవచ్చు. కేంద్ర మంత్రి ఇచ్చిన ఈ ప్రకటనతో, త్వరలోనే లక్షకు పైగా జాబ్స్ భర్తీ కానున్నాయని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ జాబ్స్ కి ప్రిపేర్ కండి.. మీ లక్ ను పరీక్షించుకోండి.