Long Hair Tips: శీతాకాలంలో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు కొన్ని సులభమైన చిట్కాలను ఉపయోగించి జుట్టును దట్టంగా, బలంగా మార్చుకోవచ్చు. చలికాలంలో జుట్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వింటర్ సీజన్‌లో జుట్టు సంబంధిత సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా హోం రెమెడీస్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అంతు కాకుండా జుట్టు పెరిగేలా చేస్తాయి. మరి ఏ హోం రెమెడీస్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టును ఒత్తుగా, దృఢంగా మార్చుకోవడానికి హోం రెమెడీస్ వాడవచ్చు. ఇవి జుట్టుకు ఎటువంటి హాని కలిగించకుండా ఉంటాయి. అంతే కాకుండా జుట్టును బలోపేతం చేస్తాయి. మెంతి గింజలు, కొబ్బరి నూనె, ఎగ్, అలోవెరా జెల్, పెరుగుతో పాటు మరిన్నో హోం రెమెడీస్ జుట్టుకు ఉపయోగించవచ్చు.
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు:
మెంతి గింజల పేస్ట్:
ఎందుకు : మెంతి గింజల్లో ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ ఉన్నాయి. ఇది జుట్టును బలపరుస్తుంది . అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
తయారు చేసే విధానం: మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. వీటిని ఉదయాన్నే పేస్ట్‌లా చేసి జుట్టుకు, తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి.తరుచుగా దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు చుండ్రును తగ్గిస్తాయి.
కొబ్బరి నూనె:
ఎందుకు : కొబ్బరి నూనె జుట్టుకు పోషణనిచ్చి బలాన్నిస్తుంది.
ఎలా అప్లై చేయాలి: కొబ్బరి నూనెను వేడి చేసి తలకు పట్టించాలి. ఆయిల్ తేలికగా మసాజ్ చేసి రాత్రంతా వదిలివేయండి. అనంతరం ఉదయం షాంపూతో వాష్ చేయండి. ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ అవ్వడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా హెయిర్‌కు కావాల్సిన పోషణను అందిస్తుంది.
ఎగ్:
ఎందుకు : గుడ్డులో ప్రొటీన్ ఉంటుంది. ఇది జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి.
ఎలా అప్లై చేయాలి: గుడ్డును జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో వాష్ చేయాలి.
అలోవెరా జెల్:
ఎందుకు : అలోవెరా జెల్ జుట్టుకు తేమను అందిస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గిస్తుంది.
ఎలా అప్లై చేయాలి: అలోవెరా జెల్‌ను నేరుగా జుట్టుకు అప్లై చేయండి. అరగంట తర్వాత వాష్ చేయండి.
ఉల్లిపాయ రసం:
ఎందుకు : ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఎలా అప్లై చేయాలి: ఉల్లిపాయ రసాన్ని తీసి జుట్టు, తలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో వాష్ చేయాలి.
పెరుగు:
ఎందుకు : పెరుగులో ప్రోటీన్ , లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది.
ఎలా అప్లై చేయాలి: పెరుగును జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి.
Also Read: ఈ ఒక్కటి వాడితే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
కొన్ని అదనపు చిట్కాలు:
ఆరోగ్యకరమైన ఆహారం: ప్రోటీన్లు, విటమిన్లు , మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
నీరు త్రాగాలి: తగినంత నీరు త్రాగాలి.
ఒత్తిడిని తగ్గించుకోండి: జుట్టు రాలడానికి ఒత్తిడి కారణం కావచ్చు.
తేలికపాటి షాంపూ ఉపయోగించండి: సల్ఫేట్ , పారాబెన్ లేని షాంపూ ఉపయోగించండి.
సున్నితంగా దువ్వండి: తడి జుట్టును దువ్వకండి.