BigTV English

Konda Surekha on KTR: మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్.. ఎందుకు అధికారులను దేశం దాటించారు?

Konda Surekha on KTR: మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్.. ఎందుకు అధికారులను దేశం దాటించారు?

Konda Surekha on KTR: మంత్రి కొండా సురేఖ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి బీఆర్ఎస్ వ్యవహారశైలిపై దుమ్మెత్తి పోశారు. నాలుగైదు అంశాలపై బీఆర్ఎస్ నేతలను ఆమె చీల్చిచెండారారు. తొలుత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నోరు ఎత్తారు.


బీఆర్ఎస్ నేతల హస్తం లేకపోతే ఆఫీసర్లను ఎందుకు దేశం దాటించారని ప్రశ్నించారు. చేసేది న్యాయమే అయితే సోషల్‌మీడియాను వేరే దేశం నుండి నడపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. మా ప్రభుత్వం రీవేంజ్ తీర్చుకునేలా ఉంటే ఈపాటికి బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్ళు వారని గుర్తు చేశారు.

తెలంగాణ తల్లిని దొరసాని మారిదిగా చేస్తామని బీఆర్ఎస్ ప్రగల్భాలు పలికిందని, బంగారు ఆభరణాలు, వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లిని తయారు చేస్తామని చెప్పారని ఎక్కడని అన్నారు. సబ్బండ వర్గాల ప్రతినిధిగా తయారు చేశారని రుసరుసలాడారు.


బీఆర్ఎస్ ఉచ్చులో యువతకు సూచన చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, నిరుద్యోగం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేశారు.

ALSO READ: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్

కౌశిక్ రెడ్డి ఓ పిచ్చోడని, అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తాడని.. మెదడు లేకుండా ఏదో మాట్లాడతాడని ఆగ్రహించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న కేటీఆర్ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడే దరిద్రమైన భాష వాళ్ళ నాన్న (కేసీఆర్) ఎన్నడూ మాట్లాడలేదన్నారు.

తెలంగాణ వస్తుందని తెలిసి అమెరికా నుండి తట్ట బుట్ట సర్దుకుని వచ్చారని ధ్వజమెత్తారు మంత్రి. తెలంగాణ ఉద్యమం క్రెడిట్ కోసం నువ్వు, నీ చెల్లి రాష్ట్రానికి వచ్చారన్నారు. మాట్లాడితే ప్రభుత్వాన్ని పడగొడతామని చిలక పలుకులు పలుకున్నారని చెప్పుకొన్నారు.

యువత జీవితాలతో ఆడుకున్నది కేసీఆర్ అని, మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. మూసీ ఉద్యమం చేస్తామని కారు పార్టీ నేతలు చెబుతున్నారని, ఈసారి పెట్రోల్ బాటిల్ తెచ్చుకోవాలని, ప్రజలు అగ్గిపెట్టి ఇస్తారని చురక వేశారు.

బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే.. కాంగ్రెస్‌ను గెలిపించార న్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల గురించి రేవంత్‌రెడ్డి సర్కార్ ఆలోచన చేస్తోందన్నారు. గౌడ్ల భద్రత కోసం పరికరాలు అందించిన తొలి వ్యక్తి సీఎం రేవంత్ అని తెలియజేశారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×