Jobs in Govt Medical College: విజయనగరం జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. జిల్లాలోని మెడికల్ కాలేజీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
విజయనగరంలోని మెడికల్ కాలేజ్(GMC)లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. పలు విభాగాల్లో ఖాళీగ ఉన్న ఉద్యోగాలకు నియామకం జరుపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం అర్హత కలిగిన అందరూ అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 91
చైల్డ్, క్లినికల్, ల్యాబ్, ఓటీ, డెంటల్, సిస్టమ్, నెట్ వర్క్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి.
సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 2
స్పిచ్ థెరఫిస్ట్: 1
జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్: 25
సైకియాలజిస్ట్: 2
ల్యాబ్ అటెండెంట్: 1
లైబ్రరీ అసిస్టెంట్: 2
ఆఫీస్ సబార్డినేట్: 3
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 22
టెక్నీషియన్: 5
ఎలక్ట్రీషియన్ గ్రేడ్-3: 01
స్టోర్ అటెండర్: 2
జనరల్ డ్యూటీ అటెండెంట్: 17
ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్: 1
అడ్మినిస్ట్రేటర్: 2
కంప్యూటర్ ప్రొగ్రామర్: 2
ఎలక్ట్రికల్ హెల్ఫర్: 3
విద్యార్హత: టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ(ఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ) బీఎస్సీ, బీఈ/బీటెక్, పీజీ పాస్‌తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 42 ఏళ్ల వయస్సు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్‌లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.300, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికెట్స్ పరిశీలన తదితర అంశాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 08
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగాలు: 91
వయస్సు: 42 మించకూడదు
చివరి తేది: జనవరి 8, 2025
విద్యార్హత: టెన్త్, ఇంటర్
Also Read: RRB Recruitment: రైల్వేలో భారీగా వేకెన్సీలు.. ప్రారంభ వేతనం రూ.40,000.. మీకు ఈ అర్హత ఉంటే చాలు..!
విజయనగరం జిల్లాలోని మెడికల్ కాలేజీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్. అవకాశం మళ్లీ రాదు వెంటనే దరఖాస్తు చేసుకోండి