Telangana Inter Results: తెలంగాణ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిసిసన విషయం తెలిసిందే. అయితే ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు దిద్దే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఫలితాల్లో పారదర్శకత పాటించేందుకు విద్యాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్టూడెంట్స్, వారి పేరెంట్స్ కూడా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల ఆఖరు లోగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈ ఏడాదికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను త్వరగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఏప్రిల్ లాస్ట్ వీక్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మొత్తం ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కలుపుకుని మొత్తం 9,96,971 మంది ఎగ్జామ్స్ రాశారు. ఫలితాల కోసం స్టూడెంట్స్ ఎదురుచూస్తున్నారు.
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఫలితాలు ఇతర వెబ్ సైట్స్, యాప్ ల ద్వారా థర్డ్ పార్టీ ఏజెన్సీలు కూడా తెలుసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. 2023కి సంబంధించి ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. అయితే ఈ సారి ఏప్రల్ చివరి వారం లోనే ఫలితాలను విడుదలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
ఫలితాలు ఈజీగా ఇలా చూడొచ్చు..
☀ ఇంటర్ ఫస్ట్ సెకండీయర్ ఫలితాల కోసం ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ tsbie.cgg.gov.in ఓపెన్ చేయాలి.
☀ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బ్రిడ్జ్ కోర్స్ లింకులు కనిపిస్తాయి. దాని పక్కన రిజల్ట్స్ లింక్ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయాలి
☀ రిజల్ట్ ఇయర్, ఫస్ట్ లేదా సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి.
☀ క్యాటగిరీ, ఎగ్జామినేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. గెట్ మెమోపై క్లిక్ చేసి.. రిజల్ట్స్ చూసుకోవచ్చు.
☀ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఓపెన్ అవుతాయి. దానిని ప్రింట్ తీసుకుని మీరు భద్రపరుకోవాలి. తర్వాత అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది.
ఏవైనా డౌట్స్ ఉంటే..?
ఇంటర్ పరీక్షలు పాస్ అయ్యేందుకు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు రావాలి. మొత్తం మీద 35 శాతం మార్కులు సాధించిన వారు ఫెయిల్ కింద పరగణించబడుతారు. రిజల్ట్స్ పై ఎలాంటి డౌట్స్ ఉన్నా రీ వాల్యూయేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం సప్లిమెంటరీ పరీక్షలు పెడుతారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత, మూల్యాంకనం లేదా మార్కుల విషయంలో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే.. వారు ఇంటర్ బోర్డును కాంటాక్ట్ అవ్వొచ్చు.
ALSO READ: AAI Recruitment: ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే రూ.31,000
ALSO READ: NABARD Jobs: నాబార్డ్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.50 లక్షల జీతం భయ్యా.. నేడే లాస్ట్ డేట్..!