BigTV English

Ari Movie: అనసూయ ‘అరి’ కి కష్టాలు.. రిలీజ్‌ అయ్యేనా?

Ari Movie: అనసూయ ‘అరి’ కి కష్టాలు.. రిలీజ్‌ అయ్యేనా?

Ari Movie: సినిమా పరిశ్రమ అనేది ఒక మాయాజాలం.. ఎప్పుడూ ఏ సినిమాకు అదృష్టం వరిస్తుందో తెలియదు.. ఏ సినిమా థియేటర్లలో సక్సెస్ అవుతుంది..? ఎలాంటి కథలకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారో చెప్పడం కష్టమే. కొన్ని సినిమాలు చిన్న స్టోరీ లైన్ తో వచ్చి భారీ విజయాలను అందుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఏళ్ల తరబడి ల్యాబ్‌కే పరిమితం అవుతుంటాయి. అయితే వీటిల్లో కొన్ని చిత్రాలు సరైన కంటెంట్‌ లేక ఆగిపోతే..మరికొన్ని మాత్రం డిఫరెంట్‌ కంటెంట్‌, ఎవరూ టచ్‌ చేయలేని, ట్రెండింగ్‌ పాయింట్‌ ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఈ కోవలోకి చెందిన చిత్రమే ‘అరి’.. ఈ సినిమాకు అసలు రిలీజ్ కష్టాలు ఎందుకు? ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


‘పేపర్ బాయ్ ‘ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న జయశంకర్ ఈ ‘అరి’ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సినిమా కంటే ముందు గీతా ఆర్ట్స్‌లో జయశంకర్‌ ఓ సినిమా చేయాల్సింది. స్క్రిప్ట్‌తో పాటు ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా షూరు అయ్యాయి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. కాస్త గ్యాప్ తీసుకొని కొత్త నిర్మాతలతో కలిసి అరి చిత్రాన్ని నిర్మించారు. ఇంతవరకు ఎవరు టచ్‌ చేయని అరిషడ్వర్గాలపై స్టోరీ రాసుకున్నాడు. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ లాంటి అగ్ర నటులు ఈ చిత్రంలో నటించారు.

అయితే ఈ మూవీ 2024 లోనే రిలీజ్ కావాల్సింది. ఈ మేరకు ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టారు. టీజర్‌, ట్రైలర్‌తో పాటు మంగ్లీ ఆలపించిన కృష్ణుడి సాంగ్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ప్రచార చిత్రాలన్నింటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి సైతం ఈ సినిమాకు మద్దతు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అనేది వాయిదా పడడం జరిగింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని మళ్లీ స్టార్ట్‌ చేశారు. నిన్న ‘కల్కి’ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌తో ఈ సినిమా థీమ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేయించారు. ‘భగ భగ..’ అంటూ సాగే ఈ పాటకు కూడా ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సారి కూడా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్‌. ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో పాటు బీజేపీ నేతల సపోర్ట్‌ ఉన్నప్పటికీ సినిమా ఎందుకు విడుదల కావడంలేదో తెలియదు. ఇలాంటి డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలను త్వరగా రిలీజ్‌ చేసుకుంటేనే మంచిది. ఆలస్యం అయ్యేకొద్ది కంటెంట్‌ పాతదై పోతుంది. ఇలాంటి స్టోరీలతో కొత్త సినిమా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.. అందుకే పెద్దలంటారు ఆలస్యం అమృతం విషం అని..ఈ విషయాన్ని కొత్త నిర్మాతల దృష్టిలో పెట్టుకొని సినిమాని త్వరగా రిలీజ్ చేస్తే మంచిదని కొందరి అభిప్రాయం..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×