AAI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్, డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన అభ్యర్థులు మంచి వేతనం కూడా పొందనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుక ఆలస్యం అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 89
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 11
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా పాసై ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
వయస్సు: 2024 నవంబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. అయితే నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులక పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ సెలెక్ట్ విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.31,000 నుంచి రూ.92,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://cdn.digialm.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.31,000 నుంచి రూ.92,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్ గాయ్స్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 89
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 11
ALSO READ: NABARD Jobs: నాబార్డ్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.50 లక్షల జీతం భయ్యా.. నేడే లాస్ట్ డేట్..!