Bill Gates: బిట్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పేరు తెలియని ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. బిల్ గేట్స్ ఓసారి ఇంటర్వ్యూలో ఎదురైన ఓ ప్రశ్నకు మంచి సమాధానం వెల్లడించారు. ఇంటర్వ్యూ అంటే ఒక సబ్జెక్ట్ గురించి మాత్రమే కాదు అని.. అతన బలహీనతలు ఎంటో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఉద్యోగం సాధించాలంటే కావాల్సింది అర్హతలు మాత్రమే కాదని.. కష్టమైన సమయంలో సమస్యలు ఎలా ఎదుర్కొంటారు అనేది తెలియాలి. ఇంటర్వ్యూలో ‘మేం నిన్ను ఎందుకు ఉద్యోగానికి సెలెక్ట్ చేయాలి..?’ అనే ప్రశ్నకు సమర్థవంతమైన సమాధానం ఇవ్వడానికి వ్యూహం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్వ్యూలో ఈ మూడు సూత్రాలు..
మైక్రోసాఫ్ ఫౌండర్ బిల్ గేట్స్ 2020లో ఎన్‌బీఏ స్టార్ స్టీఫెన్ కర్రీతో జరిగన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు బిల్ గేట్ సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం ఉద్యోగానికి సంబంధంచిన నైపుణ్యం మాత్రమే కాకుండా.. ఆ జాబ్ రోల్ లో మీరు ఉత్తమంగా ఎలా సరి తూగుతారో చూపిచండంలో ఇది మంచి ప్రశ్న అని ఆయన చెప్పుకొచ్చారు. బిల్ గేట్స్ ఇంటర్వ్యూలో ఉద్యోగానికి సెలెక్ట్ చేసేటప్పుడు మూడు కీలక సూత్రాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అందులో ఒక్కటి అతని వర్కింగ్ స్కిల్, అతని మనస్తత్వం, కంపెనీ రూల్స్ అనుగుణంగా ఉండగలడా.. అనేవి ముఖ్యమని ఆయన చెప్పారు.
ALSO READ: Demu Train: ఈ రైలు కేవలం 9 కి.మీలే ప్రయాణిస్తాది.. ఎక్కడో కాదు ఇండియాలోనే!
బిల్ గేట్స్ తన ఉద్యోగ అర్హతలను చెప్పడానికి బదులుగా.. ఇతర బెస్ట్ ఎగ్జాంపుల్స్ ద్వారా తన స్కిల్స్ ను ప్రూవ్ చేసుకోవాలని చెబుతున్నారు. తాను చెప్పు కోర్సులలో ముఖ్యంగా ‘టీచ్ చేయడం దాని కన్నా.. నేను ఎలా ముందుకు కొనసాగాను.. కాలక్రమేణా ఎా మెరుగు పడ్డాను’ అనేది వివరిస్తానని చెప్పారు. ఇంటర్వ్యూలో సాధించిన విజయాలు గురించి చెప్పడం, అలాగే.. ‘నేను నా ఉద్యోగంలో ఎంత గొప్పగా రాణిస్తున్నాను’ అనే చెప్పే బదులు మిమ్ముల్ని ప్రత్యేకంగా చూపించే నిర్ధష్టమైన ప్రాజెక్టులు, స్కిల్స్ గురించి క్లుప్తంగా వివరించాలని బిల్ గేట్స్ చెప్పారు.
వ్యక్తిగల సవాళ్లు ఉన్నప్పటికీ.. టీంతో పని చేయగల సామర్థ్యం ఉండాలని అన్నారు. సహ ఉద్యోగుల పనిని అతిగా విమర్శించగలను కానీ.. ప్రతిష్టాత్మక ఫలితాల కోసం ముందుకు సాగడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఉద్యోగుల బలహీనతలు చూడకూడదని.. మంచి అవుట్ పుట్ కోసం పనిలో వారి ప్రోత్సహించాలని తెలిపారు. ఉద్యోగులను ప్రోత్సహిస్తే.. ఆఫీస్ లో మంచి వాతవారణం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇలాంటప్పుడు కంపెనీ భవిష్యత్తుపై ఉద్యోగలు ఫోకస్ చేస్తారిని అన్నారు. ‘’నాకు ప్రతిష్టాత్మక లక్ష్యాలు ఇష్టం. భవిష్యత్తును ఎలా ఊహించాలో ముందు ఆలోంచించడం నాకు ఇష్టం’ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.దీర్ఘకాలిక ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణల పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించడం ద్వారా, తన ఆశయాలు నెరవేరుతాయని బిల్ గేట్ చెబుతున్నారు.
బిల్ గేట్స్ సమాధానాల్లో అత్యంత అద్భుతమైన అంశాలల్లో ఇదొకటి. బలహీనతలను బలంగా మార్చుకోగల సామర్థ్యం ఉండాలని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో విమర్శనాత్మక స్వభావాలను కూడా ఆయన అంగీకరిస్తామనని చెప్పుకొచ్చారు. విమర్శల వల్ల కొన్ని సందర్భాల్లో మంచే జరుగుతోందని చెప్పారు.
‘ఇంటర్వ్యూలో మీరు ఇలా మాట్లాడండి. ఉద్యోగం లో వృత్తపరమైన స్కిల్స్ ను గుర్తించాలి. కొన్ని సవాళ్లను ఎలా స్వీకరించాలో తెలియాలి. టీంకు ప్రయోజనం చేకూర్చే విధంగా మీరు ఎలా వ్యవహరిస్తారో తెలియజేయాలి. అస్పష్టమైన లేదా ప్రతికూల ధోరణులకు దూరంగా ఉండాలి. నిజాయితీ వ్యవహరించాలి’ అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. బెస్ట్ ఎగ్జాంపుల్ తో ముఖ్యమైన వర్క్ స్కిల్ ను హైలెట్ చేయాలి. ఒక సవాలును ఎదుర్కొనేటప్పుడు టీం కృషిని వివరంపజేయాలి. కంపెనీ లక్ష్యాలతో సమన్వయాన్ని కనబరచాలి’ అని బిల్ గేట్స్ తెలిపారు.
ఇంటర్వ్యూలో ఈ విధంగా సమాధానం చెప్పడం వల్ల మీకు చాలా తోడ్పడుతోంది. మీరు ఉద్యోగానికి ఎందుకు సరితూగుతారో.. ఈజీగా మాట్లాడేయవచ్చు.