BigTV English
Advertisement

Tesla’s EV In India : టెస్లా కారు వచ్చేస్తోంది – ప్రారంభ ధర ఎంతో తెలుసా.?

Tesla’s EV In India : టెస్లా కారు వచ్చేస్తోంది – ప్రారంభ ధర ఎంతో తెలుసా.?

Tesla’s EV In India : భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీ తర్వాత భారత్ లోకి టెస్లా ఎంట్రీకి మార్గమం సుగమమం అయినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే.. దేశంలోని వివిధ విభాగాల్లో పని చేసేందుకు ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్న టెస్లా.. ఉద్యోగ ప్రకటనలు కూడా ఇచ్చేసింది. దీంతో.. ఈ అంతర్జాతీయ ఎలక్ట్రికల్ వెహికిల్ దిగ్గజం భారత్ లో ఎప్పుడు అడుగు పెట్టనుంది అని మార్గెట్ వర్గాలతో సహా అనేక మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో రెండు నెలలో దేశంలో విక్రయాలు ప్రారంభించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఇప్పటికే.. దేశంలోని రెండు ముఖ్య నగరాల్లో రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థాలాల్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాల్ని ముమ్మరం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఎప్పుడు విక్రయాలు ప్రారంభించనుంది, కార్ల ప్రారంభ ధర ఎంత ఉండనుందో అనే ఆసక్తి పెరిగిపోయింది.


మొదటి షో రూమ్ ఎక్కడో తెలుసా

ఎన్నో ఏళ్లుగా భారత్ మార్కెట్లో తన వాహనాల్ని విక్రయించాలని చూస్తున్న టెస్లా.. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నుంచి దేశంలో టెస్లా వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ప్రస్తుతానికి దేశీయంగా ఉత్పత్తి ప్లాంట్లను నిర్మించడం, ఇక్కడే ఉపాధీ అవకాశాల్ని పెంచడం వంటి అనేక షరతుల్ని పక్కనపెట్టి.. బెర్లిన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన వాహనాల్ని దేశంలో విక్రయించనున్నారు. ఇందుకోసం.. దేశంలోని రెండు ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబైలలో స్థలాల్ని సైతం గుర్తించి, లీజు అగ్రిమెంట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ముంబైలోని BKC బిజినెస్ డిస్ట్రిక్ట్, న్యూ దిల్లీలోని ఏరోసిటీలో షోరూమ్ లను ఏర్పాటు చేయనున్నారు.


ప్రారంభ ధర ఎంత ఉండనుంది

భారత్ లో మధ్య తరగతి వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని టెస్లా కార్లను ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. మిగతా మార్కెట్ల కంటే భారతీయుల ఆలోచనలు, అంచనాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడి వాళ్లకు.. తక్కువ, అందుబాటు ధరల్లోనే మంచి ఫీచర్లున్న వాహనాల్ని ఎంచుకుంటుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. టెస్లా తన కార్ల ప్రారంభ ధరను $25,000 యూఎస్ డాలర్లుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అంటే.. భారత కరెన్సీలో.. సుమారు రూ.21 లక్షలు, వీలైతే అంత కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తుందని సమాచారం.

ఇప్పటికే విదేశాల్లో తయారీ ప్లాంట్లు ఉండగా, అక్కడి నుంచి సరఫరా చేయాలనేది మొదటి నుంచి టెస్లా ప్రణాళిక. కానీ.. విస్తృతమైన మార్కెట్ అందుబాటులో ఉంచుకుని, ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసే వాహనాల్ని వినియోగించాల్సిన అవసరం లేదనేది భారత ప్రభుత్వ వాదన. ఇక్కడ విశాలమైన మార్కెట్ ఉన్నప్పుడు.. ఇక్కడే ఉత్పత్తి చేస్తే స్థానికంగా ఉపాధీ, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటోంది. కానీ.. మార్కెట్ డిమాండ్ ను బట్టి తర్వాతి కాలంలో ప్లాంట్ల నిర్మాణంపై ఆలోచిస్తామన్నది టెస్లా వాదన. ఈ ఆలోచనల కారణంగానే.. ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన టెస్లా కార్ల తయారీ, భారత్ లో అమ్మకాలు.. అనేక అంతర్జాతీయ పరిణామనల నేపథ్యంలో సాధ్యపడనుంది.
దీంతో.. భారత ప్రభుత్వ ఆలోచనలకు దగ్గరగా ఉండేందుకు.. టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతీయ OEM సరఫరాదారుల నుంచి విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున సమీకరించుకోవాలని యోచిస్తోంది. ఈ సేరరణ 2025 నాటికి $1 బిలియన్ అంటే వంద కోట్లు దాటుతుందని అంచనా.

కార్యాలయాలు ఎక్కడంటే..

టెస్లా ఏర్పాటు చేయనున్న తన విక్రయ షో రూమ్ లను న్యూదిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీ ప్రాంతంలో గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ స్థలాన్ని ఇప్పటికే.. షోరూమ్ కోసం లీజుకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏరోసిటీ ప్రాంతంలో హోటళ్ళు, రిటైల్ అవుట్‌లెట్‌లు, ఇంటర్నేషనల్ సంస్థల కార్యాలయాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాగే.. ముంబైలోనూ ప్రముఖ ప్రాంతమైన నగర విమానాశ్రయానికి సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని వ్యాపార, రిటైల్ హబ్‌లో స్థలాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. దిల్లీ, ముంబై షోరూమ్‌లు రెండూ దాదాపు 5,000 చదరపు అడుగుల మేర విశాలంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. అవుట్‌లెట్‌ల ప్రారంభ తేదీలు ఇంకా నిర్ణయించలేదు.

Also Read : NASA Asteroid : ఇండియాకు గ్రహశకలం ముప్పు? మన వైపే దూసుకొస్తోందట, బి అలర్ట్!

Related News

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Big Stories

×