Demu Train: భారతదేశంలో అని ప్యాసింజర్ రైలు ఎక్కడుందో మీకు తెల్సా..? ఆ ట్రైన్ కేవలం 9 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తోందట. చాలా ఆసక్తిగా ఉంది కదా.. ఇప్పుడు మనం ఆ రైలు గురించి తెలుసుకుందాం.
అత్యంత దూరం ప్రయాణించే రైలు గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ.. ఈ తక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి ఎవరికీ తెలియదు. ఆ ట్రైన్ పేరే డేము. ఈ ట్రైన్ కేరళ రాష్ట్రంలో కొచ్చి నగరంలోని రెండు కీలక ప్రదేశాల మద్య ప్రయాణిస్తోంది. విల్లింగ్ టన్ ఐలాండ్ నుంచి ఎర్నాకులంలోని ఈ ట్రైన్ మన దేశపు అతి చిన్నపు ప్యాసింజర్ ట్రైన్. కేవలం 9 కిలోమీటర్లు దూరంలో రెండు స్టేషన్ ల మధ్య ట్రైన్ నడుస్తోంది. కేవలం మూడు కోచ్ లతో.. ఇది రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రయాణిస్తుంది. అది కూడా 40 నిమిషాలు మాత్రమే జర్నీ చేస్తుంది.
భారతదేశపు అతి చిన్న ప్యాసింజర్ ట్రైన్ అయిన డేము మూడు కోచ్‌లను మాత్రమే కలిగి ఉంది. ఈ ట్రైన్ లో 300 మంది ప్రయాణీకులకు సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. కేవలం ఒకే ఒక్క స్టాఫ్ తో ప్రయాణికుల అందరినీ ఆకర్షిస్తోంది. ఈ రైలు ముఖ్యంగా కేవలం మూడు కోచ్ లతో భారతదేశంలో అతి చిన్న ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇంత చిన్న పరిమాణంలో రైలు ఉన్నప్పటికీ 300 ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ ఉంది.
గ్రీన్ కలర్ తో కూడిన ఈ డేము రైలు రోజులు రెండు సార్లు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం వేళ ఒకసారి ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఇది కొచ్చి నడిఒడ్డున కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్, సదరన్ నావల్ కమాండ్ ను కలుపుతోంది. రైలులో సీటింగ్ సెపాసిటీ ఉన్నప్పటికీ ఇందులో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇప్పటికీ, ఇది కొచ్చి ప్రజలకు ఒక ముఖ్యమైన కనెక్షన్‌గా మిగిలిపోయింది.
చిన్న ప్రయాణంలో చుట్టు పక్కల చుట్టుపక్కల అద్భుతమైన ప్రదేశాలు ప్రయాణికులను ఆకర్షిస్తోంది. నగరంలోని రెండు ప్రాంతాల మధ్య సుందరమైన, ప్రశాంతమైన అనుభూతిని ప్రయాణికులకు అందిస్తుంది. భారతదేశంలో అతి చిన్నది అయిన ఈ రైలు ప్రయాణికులు మంచి సేవలను అందిస్తోంది. ఇందులో ప్రయాణించే వారికి మనోహరమైన, ప్రశాంతమైన ఆహ్లాద వాతావరణాన్ని పొందుతారు. మరి ఈ స్పెషల్ ట్రైన భవిష్యత్తులో కొనసాగుతుందా..? దీనకి కాలమే సమాధానం చెప్పాలి..!