Jobs In UGC: నిరుద్యోగులకు మంచి అవకాశం ఇది. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పాసైన వారికి సువర్ణవకాశం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఢిల్లీలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్నవారందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఢిల్లీలో యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5
ఇందులో యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగ ఖాళీల వారీగా..
యంగ్ ప్రొఫెషనల్ 3,
సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ 1,
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్-1
వయస్సు: యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగానికి 40 ఏళ్లు, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగానికి 64 ఏళ్లు, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగానికి 50 ఏళ్ల వయస్సు ఉంటే సరిపోతుంది.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్ కు రూ.60,000 నుంచి రూ.70,000 వరకు జీతం ఉంటుంది. సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ రూ.50,000- రూ.70,000 వరకు జీతం కల్పిస్తారు. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.50,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు చివరి తేది: 202 జనవరి 25
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ugc.gov.in/
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు. దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. మరి ఇంకెందుకు ఆసల్యం ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.