BigTV English

Actress : 53800 కోట్ల ఆస్తి, బిజినెస్ మ్యాన్ ను పెళ్ళాడిన హీరోయిన్… ఫస్ట్ మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్

Actress : 53800 కోట్ల ఆస్తి, బిజినెస్ మ్యాన్ ను పెళ్ళాడిన హీరోయిన్… ఫస్ట్ మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్

Actress : సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టే వాళ్ళు కొంతమంది అయితే… వందల కోట్ల ఆస్తులకు వారసులై ఉండి, ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవాలని ఆరాటపడే వాళ్ళు మరి కొంతమంది. వాళ్లనే నెపో కిడ్స్ అంటూ ఉంటారు. అలా వేల కోట్లకు వారసుడైన బిలియనీర్ ను వివాహం చేసుకున్న ఓ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఆమె ఫస్ట్ మూవీనే అట్టర్ ప్లాఫ్ గా నిలిచి షాక్ ఇచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం పదండి.


మామూలు బ్యాక్ గ్రౌండ్ కాదు 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ బిలియనీర్ బిజినెస్ మ్యాన్ భార్య ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ షర్మిన్ సెగల్ (Sharmin Segal). ఆమె బాలీవుడ్ బడా డైరెక్టర్లలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలి మేనకోడలు. మొదట్లో తన మామ దర్శకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పని చేసింది ఈ అమ్మడు.


షర్మిన్ (Sharmin Segal) 1995లో ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ దీపక్ సెగల్, ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ బేలా సెగల్ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కంటెంట్ హెడ్‌గా పని చేస్తున్నారు. షర్మిన్ తల్లి బేలా ‘ఖామోషి’, ‘దేవదాస్’. ‘బ్లాక్‌’తో సహా భన్సాలీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసారు. 2012లో ఆమె దర్శకురాలిగా ఓ మూవీ కూడా చేసింది. షర్మిన్ తాత మోహన్ సెగల్ న్యూ ఢిల్లీ, సావన్ భాడోన్, రాజా జానీ, ఏక్ హి రాస్తాగా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్.

సినిమాల్లోకి ఎంట్రీ 

షర్మిన్ (Sharmin Segal) 18వ ఏట తన మామ సంజయ్ లీలా భన్సాలీ ‘రామ్-లీలా’ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించింది. మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి అనే మూడు సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. 2019లో రిలీజ్ అయిన ‘మలాల్‌’ మూవీతో హీరోయిన్ గా మారింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక చివరిగా భన్సాలీ వెబ్ సిరీస్ ‘హీరామండి’లో ఓ పాత్రను పోషించగా, ఆమె నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఒక సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో కామెంట్స్ ఆప్షన్ నే తీసేసింది.

బిలియనీర్ తో పెళ్లి

నవంబర్ 2023లో షర్మిన్ (Sharmin Segal)  వ్యాపారవేత్త అమన్ మెహతాను వివాహం చేసుకున్నారు. అమన్ బిలియనీర్ అయిన బిజినెస్ టైకూన్ సమీర్ మెహతా కుమారుడు. అమన్ ప్రస్తుతం టొరెంట్ ఫార్మాస్యూటికల్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 1959లో ఆయన తాత యూఎన్ మెహతా స్థాపించిన టోరెంట్ గ్రూప్ ప్రధాన సంస్థలలో ఇది కూడా ఒకటి. 40 దేశాలలో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సమాచారం ప్రకారం అమన్ తండ్రి సమీర్ మెహతా ఆస్తుల విలువ 6.44 బిలియన్ డాలర్లు. మన రూపాయల్లో చెప్పాలంటే.. రూ. 53,800 కోట్లు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×