E-Paper
Advertisement

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
Advertisement

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. షాజహాన్ పుర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారరణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంపై అలగంజ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలలాబాద్ నుంచి ఒక ఆటో ప్రయాణికులతో వస్తోంది. అందులోని ప్రయాణికులంతా గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు బయల్దేరారు. ఆటోను.. ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తోన్న ఒక ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. బరేలీ – ఫరూఖాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతులలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను సీఎం యోగి ఆదేశించారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×