BigTV English
Advertisement

Jio: రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. అదిరిపోయే ఆఫర్..!

Jio: రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. అదిరిపోయే ఆఫర్..!

Jio: ప్రముఖ టెలీకాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు స్పెషల్ ప్లాన్‌లను అందిస్తుంది. తాజాగా మరొక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకొచ్చింది.


రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ జియో కంపెనీ ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తెచ్చింది. రూ.2999 లతో రీఛార్జ్ చేసుకుంటే కళ్లుచెదిరే బెనిఫిట్స్ పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 365 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజూ 100 SMSలు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు డైలీ 2.5GB డేటాను పొందుతారు. మొత్తం డేటా 912.5GB ఇస్తున్నారు. ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసుల సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

  • దీంతోపాటు 2 స్విగ్గీ కూపన్లు పొందవచ్చు. రూ.299ల ఆర్డర్‌పై రూ.125 ఆఫర్ ఉంటుంది.
  • Ixigo నుంచి విమాన టికెట్లపై రూ.1500 వరకు ఆఫర్ లభిస్తుంది. 1 ప్యాసింజర్‌కి రూ.500, 2 ప్యాసింజర్లకు రూ.1000, 3 ప్యాసింజర్లకు రూ.1500 ఆఫర్ ఇస్తారు.
  • Ajio నుంచి రూ.2499ల ఆర్డర్‌పై ఫ్లాట్ రూ.500 ఆఫర్ పొందొచ్చు.
  • Tira నుంచి రూ.999 కొనుగోళ్లకు, ఎంపిక చేసిన ఉత్పత్తులపై 30శాతం ఆఫర్ లభిస్తుంది. మాగ్జిమం డిస్కౌంట్ రూ.1000.
  • రిలయన్స్ డిజిటల్ నుంచి ఎంపికచేసిన ఉత్పత్తులపై మినిమం రూ.5వేలు కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్ పొందొచ్చు. మాగ్జిమం డిస్కౌంట్ రూ.10,000.

ఇకపోతే ఈ ప్లాన్‌లో నెట్ డేటా మొత్తం అయిపోయిన తర్వాత 64 Kbps అన్‌లిమిటెడ్‌గా వస్తుంది. అలాగే అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్లు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా పొందొచ్చు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×