
3D IVF Process : 3డీ టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. ముఖ్యంగా హెల్త్ విభాగంలో 3డీ టెక్నాలజీతో ఎన్నో ప్రయోగాలు సాధ్యమవుతున్నాయి. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మనిషి సమస్యల గురించి, పలు రకాల వ్యాధుల గురించి, అంతే కాకుండా అవయవాల గురించి కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. తాజాగా ఈ 3డీ టెక్నాలజీ ద్వారా మరో కొత్త ప్రయోగం కూడా సక్సెస్‌ఫుల్ అయ్యింది.
3డీ టెక్నాలజీ సాయంతో మొదటిసారి ఎంబ్రియో ఇమేజెస్‌ను క్రియేట్ చేశారు శాస్త్రవేత్తలు. కేవలం తక్కువ లైట్ సాయంతో క్షణంలోనే ఈ ఇమేజెస్‌ను క్రియేట్ చేసినట్టు తెలిపారు. ఎంబ్రియో డెవలప్ అవుతున్న క్రమంలో ఎలా ఉంటుందో స్టడీ చేయడం కోసం ఈ ఇమేజెన్‌ను క్రియేట్ చేశామని వారు బయటపెట్టారు. ఈరోజుల్లో చాలామందికి గర్భ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. పలు కారణాల వల్ల కొంతమందికి అంత సులభంగా పిల్లలు పుట్టడం లేదు. అలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ ప్రయోగం సాయం చేస్తుందని చెప్తున్నారు.
ప్రెగ్నెన్సీ రావడం కోసం ఎంబ్రియో క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. దాని వల్లే వారికి పిల్లలు పుట్టగలరు. ఈరోజుల్లో పిల్లలు పుట్టనివారు ఎక్కువగా వర్టో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సాయం తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియలో ముందుగా ఎంబ్రియో క్వాలిటీనే టెస్ట్ చేస్తారు. అలాంటి సమయంలో ఈ 3డీ ప్రింటింగ్ ప్రయోగం అనేది వారికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఎంబ్రియో హెల్త్‌ను తెలుసుకోవడం కోసం 3డీ ఇమేజెస్ సాయం చేస్తాయని అంటున్నారు.
ప్రస్తుతం ఐవీఎఫ్ పద్ధతుల్లో ఎంబ్రియో హెల్త్‌ను తెలుసుకోవడం కోసం బయోప్సీ లాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే దీని వల్ల వారికి మరింత సమయం వృధా అవ్వడం మాత్రమే కాకుండా సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువని తెలుస్తోంది. అందుకే 3డీ ప్రింటింగ్ ద్వారా లైట్‌తో ఎంబ్రియో హెల్త్‌ను తెలుసుకోవడం ద్వారా దానికి తగిన చికిత్సను వెంటనే అమలు చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రోజురోజుకీ ఐవీఎఫ్ చికిత్సకు డిమాండ్ పెరుగుతుండడంతో.. అందులో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చితే.. పేషెంట్లకు మరింత వేగంగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.