BigTV English

Update on Black Hole : భూగ్రహాన్ని ఆకర్షించగల బ్లాక్ హోల్.. అలా జరిగితే..

Update on Black Hole : భూగ్రహాన్ని ఆకర్షించగల బ్లాక్ హోల్.. అలా జరిగితే..
Update on Black Hole


Update on Black Hole : అంతరిక్షంలో ఆస్ట్రానాట్స్‌కు సైతం తెలియని కొన్ని మిస్టరీలు దాగున్నాయి. ఆస్ట్రానాట్స్‌కు ఉన్న వనరులతో, అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అంతరిక్షాన్ని దాదాపుగా స్టడీ చేయాలని అనుకుంటారు. కానీ అది పూర్తిగా సాధ్యం కాదు. స్పేస్‌లో జరిగే ప్రతీ ఈవెంట్ గురించి ఆస్ట్రానాట్స్‌కు సమాచారం అందే అవకాశం ఉండకపోవచ్చు. అలా స్పేస్‌లో దాగున్న ఎన్నో మిస్టరీలలో బ్లాక్ హోల్స్ కూడా ఒకటి. తాజాగా బ్లాక్ హోల్స్ గురించి ఒక ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది.

బ్లాక్ హోల్స్ అనేవి సోలార్ సిస్టమ్‌లో ఒక నల్లటి ఆకారంలో ఏర్పడే రింగ్స్ అని మాత్రమే ఆస్ట్రానాట్స్‌కు తెలుసు. దీంతో పాటు బ్లాక్ హోల్స్ అనేవాటిని గుర్తించినప్పటి నుండి వీటిపై వారు ఎన్నో స్టడీలు కూడా చేశారు. కానీ బ్లాక్ హోల్స్ గురించి పూర్తిస్థాయి సమాచారం ఇప్పటికీ వారి దగ్గర లేదు. అందుకే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్లాక్ హోల్‌కు ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల భూమి అందులోకి వెళ్లిపోతే.. తిరిగి బయటికి రావడం కష్టమని, అంతే కాకుండా ఆ పరిస్థితి ఏర్పడితే మనుషులు.. లాంగ్ పాస్థా షేప్‌లోకి మారిపోతారని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.


సోలార్ సిస్టమ్‌లో ఉన్న గ్రహాలు, గ్యాలక్సీల కంటే బ్లాక్ హోల్స్‌కు ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అందులోకి వెళ్లిన లైట్ కూడా బయటికి రాదు. అదే విధంగా ఒకవేళ భూమికి అందులోకి వెళ్తే మాత్రం బయటికి వచ్చే పరిస్థితి ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్లాక్ హోల్స్ అనేవి ఇప్పటికే వాటి చుట్టుపక్కన ఉన్న డస్ట్‌, గ్యాస్ లాంటి వాటిని ఆకర్షించి తమలో కలిపేసుకుంటున్నాయి. అంతే కాకుండా వాటి దగ్గర్లో ఉన్న గ్రహాలు కూడా దీని గ్రావిటేషనల్ ఫోర్స్‌కు అందులో కలిసిపోవాల్సిందే. వీటితో పాటు పెద్ద బ్లాక్ హోల్స్ అనేవి చిన్న బ్లాక్ హోల్స్‌ను తమలో కలిపేస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఏదైనా బ్లాక్ హోల్స్ ఫోర్స్‌కు అందులో కలిసిపోవాల్సిందే కాబట్టి వీటిని ‘డిస్ట్రక్టివ్ మాన్స్‌స్టర్స్’ అంటారు. వాటికి దగ్గరగా వచ్చినా దేనినైనా వాటిలో కలిపేసుకునే శక్తి బ్లాక్ హోల్స్‌కు ఉంది. అందుకే భూమి అనేది బ్లాక్ హోల్స్ లోపలికి వెళ్లిపోతే అసలు మనుషులు పరిస్థితి ఏంటి అని ఆస్ట్రానాట్స్‌కు అనుమానం వచ్చింది. దానిపై స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ అలా జరిగితే మనుషులు స్ఫాగెట్టిఫికేషన్‌కు గురవ్వక తప్పదని వారు తేల్చారు. బ్లాక్ హోల్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల జరిగే పరిణామాన్నే స్ఫాగెటిఫికేషన్ అంటారు.

బ్లాక్ హోల్స్‌లో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనిషి శరీరం లాంగ్ పాస్థా లాగా సాగిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మళ్లీ మామూలుగా అవ్వాలంటే ఆ ఫోర్స్ నుండి దూరంగా జరిగాలని అన్నారు. ఇలాంటి పరిణామాన్ని ఊహించడానికే భయంగా ఉందని ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు. ఒకవేళ బ్లాక్ హోల్‌లో భూమి పడిపోతే మాత్రం దాని అంతం అప్పుడే అయిపోతుందని వారు భావిస్తున్నారు. ఎందుకైనా మంచిదని బ్లాక్ హోల్స్ గురించి మరింత క్షుణ్ణంగా స్టడీ చేయడం మొదలుపెట్టారు. దీనికోసం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయం తీసుకోనున్నారు ఆస్ట్రానాట్స్.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×