BigTV English

ICC Trophies : ఐసీసీ.. ఏయే టీమ్ ఎన్ని ట్రాఫీలు గెలిచిందంటే..?

ICC Trophies : ఐసీసీ.. ఏయే టీమ్ ఎన్ని ట్రాఫీలు గెలిచిందంటే..?
ICC Trophies


ICC Trophies : ఐపీఎల్ ముగిసింది అని నిరాశపడేలోపు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూపంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు మరొక ఎంటర్‌టైన్మెంట్ దొరికింది. చాలా ఏళ్ల తర్వాత ఇండియన్ టీమ్.. తిరిగి ట్రాఫీని దక్కించుకుంటుంది అని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. 209 పరుగులతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని సాధించింది. ఈ సమయంలో ఫ్యాన్స్.. అసలు ఇప్పటివరకు ఏయే టీమ్ ఎన్ని ట్రాఫీలు గెలుచుకుంది అనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ అనేది ఏ ఫార్మాట్‌లో అయినా బలంగా ఆడుతుందని, అవతల టీమ్‌కు గట్టి పోటీని ఇస్తుంది అని క్రికెట్ నిపుణులు చెప్తుంటారు. అందుకే ఆస్ట్రేలియాతో తలబడుతున్నారు అనగానే అవతల టీమ్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడతారు. తాజాగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో ఆస్ట్రేలియా తన సత్తాను మరోసారి చాటుకుంది. ఇప్పుడు గెలుచుకున్న కప్‌తో ఆస్ట్రేలియా గెలుచుకున్న ఐసీసీ ట్రాఫీల కౌంట్ 9కి చేరింది. ఇప్పటివరకు ఏ టీమ్ ఇన్ని ట్రాఫీలను గెలవలేదు.


ఎక్కువ కప్‌లను గెలిచిన లిస్ట్‌లో ఆస్ట్రేలియా తరువాతి స్థానాన్ని ఇండియానే దక్కించుకోవడం ఫ్యాన్స్‌ను సంతోషానికి గురిచేస్తోంది. ఆస్ట్రేలియా తన జర్నీలో మొత్తంగా 9 ఐసీసీ ట్రాఫీలను గెలుచుకుంటే.. ఇండియా 5 ట్రాఫీలతో రెండోస్థానంలో ఉంది. ఈ రెండోస్థానాన్ని ఇండియా మరో దేశంతో కూడా పంచుకుంటోంది. అదే వెస్ట్ ఇండీస్. ఇండియాతో పాటు వెస్ట్ ఇండీస్ కూడా ఇప్పటివరకు 5 ఐసీసీ ట్రాఫీలను దక్కించుకుంది.

ఇండియా, వెస్ట్ ఇండీస్ తర్వాత మూడో స్థానంలో మూడు దేశాలు ఉండడం విశేషం. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్.. ఈ మూడు దేశాలు ఇప్పటివరకు మూడు ఐసీసీ ట్రాఫీలను గెలుచుకున్నాయి. ఆ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ రెండు ట్రాఫీలతో లిస్ట్‌లో నిలిచింది. ఇక సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు కేవలం ఒక్క ఐసీసీ ట్రాఫీనే గెలిచి లిస్ట్‌లో చివరి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఉన్న టాప్ 1 స్థానాన్ని చేరుకోవాలంటే ఇండియా మరో 4 ట్రాఫీలను దక్కించుకోవాలి. కానీ అది జరగడం సాధ్యమేనా అని ఫ్యాన్స్‌లో సందేహం మొదలయ్యింది. ఇక డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియా కనబరిచిన ఆటకు అందరూ ప్రశంసలు అందిస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×