BigTV English

Scorpion Venom : లీటర్ తేలు విషం జస్ట్ రూ. 82 కోట్లే.. అంత డిమాండ్ ఎందుకంటే..!

Scorpion Venom : ప్రపంచంలోనే కొన్ని వస్తువుల ఎప్పుడూ ఖరీదైనవే. ప్రాణాంతకమైన విషాలు కూడా దీనికి మినహాయింపు కాదు. విషం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాములు. మీకు తెలుసా.. తేలు విషం పాముల విషంకంటే ప్రమాదం. అయితే నమ్మినా నమ్మకపోయినా తేలు విషానికి మార్కెట్‌లో భలే డిమాండ్ ఉంది

Scorpion Venom : లీటర్ తేలు విషం జస్ట్ రూ. 82 కోట్లే.. అంత డిమాండ్ ఎందుకంటే..!

Scorpion Venom : ప్రపంచంలో కొన్ని వస్తువుల ఎప్పుడూ ఖరీదైనవే. ప్రాణాంతకమైన విషాలు కూడా దీనికి మినహాయింపు కాదు. విషం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాములు. మీకు తెలుసా.. తేలు విషం పాముల విషంకంటే ప్రమాదం. అయితే నమ్మినా నమ్మకపోయినా తేలు విషానికి మార్కెట్‌లో భలే డిమాండ్ ఉంది. లీటర్ విషం ఏకంగా రూ.82 కోట్ల మేర ధర పలుకుతుంది.


భూమిపై అత్యంత ప్రమాదకరమైన తేలు విషం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వారు తేళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. ఎందుకో తెలిస్తే మీరు కూడా తేళ్ళ ఫాం ప్రారంభించడం పక్కా.

తేలు విషాన్ని అనేక సౌందర్య ఉత్పత్తులో వినియోగిస్తారు. ఇతర ఔషధాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో తేలు విషానికి అధిక ప్రాధాన్యత ఉంది. తేలు విషాన్ని క్యాన్సర్ కణితులను గుర్తించడంలోనూ, మలేరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. మెదడు కణితుల చికిత్స, డయాబెటీస్‌ నివారణలోనూ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


డెత్‌స్టాకర్: ఇది కింగ్ కోబ్రా కంటే ప్రాణాంతకమైనది. ఈ తేలు కుట్టిన క్షణంలో ప్రాణం పోతుంది. డెత్‌స్టాకర్ విషం ప్రపంచంలోనే ఖరీదైనా ద్రవంగా అమ్ముడుపోతోంది. ఈ తేళ్లు సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇది సహారా ఎడారి, అరేబియా ఎడారి, భారతదేశంలోని థోర్ ఎడారి , ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

డెత్‌స్టాకర్ విషంలో ఉండే క్లోరోటాక్సిన్‌ని కొన్నిరకాల క్యాన్సర్‌ల చికిత్సలో ఉపయోగిస్తారు. అంతేకాదు, క్యాన్సర్‌ గడ్డలు ఎక్కడ, ఏ పరిమాణంలో ఉన్నాయో గుర్తించడంలోనూ వాడుతున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో తేళ్ల ఫారాలు పుట్టుకొచ్చాయి. ఈ విషాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్ధతులు పాటిస్తున్నారు. తేలు నుంచి రోజుకు 2 మిల్లీ లీటర్ల విషాన్ని సేకరిస్తారు. తేలు కొండెను ట్విజర్స్‌తో పిండి విషాన్ని తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎటువంటి హాని జరగదు.

దీని కాటు కత్తిలా బాధిస్తుంది. దాని బాధను మనిషి ఆపలేడు. వీటి విషం ఒక్కో గాలన్ $39 మిలియన్లు పలుకుతుంది. భారత్ కరెన్సీలో రూ.85 లక్షలు. షుగర్ క్యూబ్ కంటే చిన్న బిందువులను ఉత్పత్తి చేయడానికి రూ.11 వేలు ఖర్చవుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిని చంపడానికి ఈ విషం చుక్క సరిపోతుంది.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×