Dog: సర్కస్.. ఈ తరం పిల్లలకు ఎక్కువగా ఇది తెలియక పోవచ్చు. కానీ అప్పట్లో సర్కస్ అంటే ఎగిరి గంతేసేవారు. చిన్నా.. పెద్దా.. ఊరూ.. వాడా.. అంతా గుమికూడిపోయేవారు. పిల్లలు స్కూల్ అయిపోగానే నేరుగా సర్కస్ వద్దకు పరుగులు తీసేవారు. సర్కస్‌లో చేసే విన్యాసాలు చూసి కేరింతలు కొట్టేవారు. నిర్వాహకులు కోతులు, ఏనుగులు, కుక్కలు లాంటి జంతువులతో విన్యాసాలు చేసి ఆకట్టుకునేవారు. కర్రపట్టుకొని తాడుపై నడుస్తూ అందరినీ షాక్‌కు గురి చేసేవారు.
అలాగే ఫైర్ రింగులో నుంచి కుక్కలు, కోతులు జంప్ చేయడం, చిన్న టేబుల్‌పై ఏనుగును నిల్చోపెట్టడం, తాడుపై సైకిల్ తొక్కడం, ఒకే సైకిల్‌పై పది మంది ప్రయాణించడం లాంటివి చేసేవారు. ఆ విన్యాసాలను చూస్తుంటే వచ్చే మజా మాటల్లో చెప్పలేము. నేటి తరం పిల్లలు ఇలాంటి వాటిని చాలా మిస్ అవుతున్నారు. సర్కస్ చేసేవాళ్లు కూడా తక్కువైపోయారు. సినిమాల్లో,యూట్యూబ్‌లో ఇలా కొన్ని చోట్ల మాత్రమే సర్కస్ విన్యాసాలు కనిపిస్తున్నాయి. ఎంతైనా ఆన్‌లైన్‌లో చూసేదానికంటే.. లైవ్‌లో కళ్లతో చూస్తేనే ఆ ఎంజాయ్ వేరే లెవల్ ఉంటుంది.
ఇక ఇలానే ఓ వ్యక్తి బాస్కెట్‌బాల్ స్టేడియంలో కుక్కతో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ వ్యక్తి గండ్రంగా తిరుగుతూ ముందుకు వెళ్తూ ఉండగా.. కుక్క కిందపడకుండా అతని వీపు పైనుంచి ముందుభాగానికి వెళ్తుంది. అలాగే అతను తలకిందులుగా.. కాళ్లు పైకి పెట్టగా.. కుక్క అతని పాదాలపై దర్జాగా కూర్చుంటుంది. మళ్లీ కిందపడకుండా మెల్లిగా కాళ్లను కిందికి పెట్టి కుక్కను తన చేతుల్లోకి తీసుకుంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరలవుతోంది. ఇప్పటి వరకు లక్షల మంది ఆ వీడియోను చూశారు. వీడియోపై సరదాసరదాగా కామెంట్లు పెడుతున్నారు.
?igshid=MDJmNzVkMjY%3D