Big Stories

Language Of Elephants: ఏనుగులకు ప్రత్యేకమైన భాష.. అర్థం చేసుకుంటే ఆనందం..

Language Of Elephants : పొరపాటున ఏదైనా అడవి మృగం తప్పిపోయి.. సిటీలోకి వస్తే.. దానిని చూసి అందరూ భయపడతారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందిస్తారు. మరి అడవిలో ఈ క్రూర జంతువులతో పాటు మనుషులు కూడా జీవిస్తూ ఉంటారు కదా.. వారికి భయం కాదా..? అంటే అవుతుంది. అందుకే వారు జంతువుల కదలికలను ఎప్పుడూ కనిపెడుతూ ఉంటారు. వాటి గురించి ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలా ఏనుగులను అర్థం చేసుకున్న కొందరు ఆదివాసులు.. వాటి రహస్యాల గురించి బయటపెట్టారు.

- Advertisement -

ఏనుగుల గుంపు అనేది ఒకేసారి మనిషి మీదకు వస్తే.. సింహం, పులి లాంటి వాటికి ఎంత భయపడతామో.. అంతే భయం వాటిని చూసినా కలుగుతుంది. అందుకే ఏనుగులు గుంపుగా వెళుతున్నప్పుడు శబ్దం చేయకూడదు అని చెప్తుంటారు. పశ్చిమ ఘాట్స్‌లో నివసించే ఆదివాసులు కూడా అదే చెప్తున్నారు. కేవలం ఏనుగుల గుంపు మాత్రమే కాదు.. ఒక్క ఏనుగు ఒంటరిగా కనిపించినా కూడా శబ్దం చేయకుండా సైలెంట్‌గా నిలబడాలని సూచిస్తున్నారు. అవి మిగత ఏనుగులను పిలవడం కోసం ఏదో శబ్దం చేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడే ఆ శబ్దాలను మనం శ్రద్ధగా వినాలని అంటున్నారు.

- Advertisement -

మామూలుగా ఏనుగులు తమ తొండంతోనే శబ్దం చేస్తాయి. మిగతా ఏనుగులను పిలవడానికి వీటినే అలర్ట్‌లాగా ఉపయోగిస్తాయి. దీంతో పాటు అప్పుడప్పుడు కొన్ని ఇతర శబ్దాలను కూడా ఏనుగులు చేస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. తొండంతోనే కాదు.. ఏనుగులు తోకతో కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయని వారు తెలిపారు. ఏనుగులు ఆడుకుంటున్నప్పుడు వాటి తోకను ఎక్కువగా ఆడిస్తాయి. అవి బాధలో ఉన్నప్పుడు తొకను నిటారుగా ఉంచుతాయి. దాంతో పాటు బాధగా లేదా నిరాశతో ఉన్నప్పుడు ఏనుగులు చెవులను కూడా ఎక్కువగా కదిలిస్తాయి.

ఏనుగుల భాషను డీకోడ్ చేయడం భలే సరదాగా ఉంటుందని ఆదివాసులు అంటున్నారు. ఒక ఏనుగు ఇసుకను లేదా మట్టి, బురద వంటి వాటిని తీసుకొని ఒంటికి మొత్తం పూసుకుంటుంది అంటే అది కోపంలో లేదా చిరాకులో ఉందని అర్థమని చెప్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఇతర ఏనుగులపై సరదాగా కూడా ఇవి మట్టిని చల్లుతూ ఆడుకుంటాయని తెలిపారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో నివసించే ఆదివాసులకు ఏనుగులతో మంచి స్నేహం ఉంటుంది. అందుకే వారు ఏనుగులతో కమ్యూనికేట్ చేయగలుగుతారు కూడా. ఏనుగులు.. మనుషులతో సరదాగా ఉండాలని ప్రయత్నిస్తాయని, అందుకే మనుషులు కూడా ఏనుగులను అర్థం చేసుకొని వాటికి హాని కలిగించకుండా ఉంటే బాగుంటుందని వారు విన్నవిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News