BigTV English

Ai Help To Car Designing: ఏఐ సాయంతో కారు డిజైనింగ్.. మరింత వేగంగా..

Ai Help To Car Designing: ఏఐ సాయంతో కారు డిజైనింగ్.. మరింత వేగంగా..

Ai Help To Car Designing : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని ప్రతీ రంగంలోని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే టెక్నాలజీ రంగంలో ఏఐ వినియోగం అనేది తారాస్థాయికి చేరుకుంది. ఇక ఇతర రంగాలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలని అనుకుంటున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే పలు లగ్జరీ కార్ సంస్థలు.. ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ ఉండగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో సంస్థ చేరింది.


గత కొన్నిరోజులుగా పలు కారణాల వల్ల టయోటా పేరు ఆటోమొబైల్ రంగంలో మారుమోగిపోతోంది. తాజాగా కార్ డిజైనింగ్ ప్రక్రియలో ఏఐను ఉపయోగించాలని అని టయోటా తీసుకున్న నిర్ణయం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కార్ల డిజైనింగ్, తయారీ ప్రక్రయ అనేది ఎక్కువ సమయాన్ని తీసుకుంటోంది. అలా కాకుండా ఏఐ సామర్థ్యంతో ఈ సమయాన్ని చాలావరకు తగ్గించాలని టయోటా అనుకుంటోంది. ఇప్పటికే దీనికి తగిన కొత్త ఆల్గరిథంను కూడా సిద్ధం చేసి పెట్టుకుంది.

ఈ కొత్త ఏఐ సిస్టమ్ అనేది ముందుగా డిజైనర్లు, ఇంజనీర్ల దగ్గర నుండి స్కెచ్‌లను తీసుకొని, ఆపై వాటిలో ఉన్న లోపాలను ముందుగానే అంచనా వేసి, వాటిని కరెక్ట్ చేయనుంది. ఇప్పటికే జెనరేటివ్ ఏఐ టూల్స్ అనేవి పలు రంగాల్లో డిజైనర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అదే విధంగా ఆటోమొబైల్ డిజైనర్స్‌కు కూడా ఈ ఏఐ టూల్స్ సాయం చేసే విధంగా టయోటా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కారు డిజైనింగ్ విషయంలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి.


అలా టయోటా పూర్తిగా ఏఐపై ఆధారపడాలని అనుకోవడం లేదు. ముందు నుండి ఎలాంటి టెక్నిక్స్‌తో కార్లను తయారు చేస్తున్నారో.. అదే టెక్నిక్స్‌ను ఉపయోగిస్తూ.. మరోవైపు ఏఐ సాయం తీసుకోవాలని సంస్థ అనుకుంటోంది. డిజైనర్లు.. ఈ ఏఐ టూల్స్ సాయంతో తమ డిజైన్‌ను వేర్వేరు పద్ధతుల్లో స్టడీ చేయవచ్చు. డిజైనింగ్ విషయంలో ఏఐను ఉపయోగించడం సులభమే అయినా తర్వాత ప్రక్రియల్లో పూర్తిగా దీనిపై ఆధారపడడం కష్టంగా మారుతుందని, కానీ త్వరలోనే అన్నింటిని పరిష్కారం కనుక్కుంటామని టయోటా యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×