BigTV English

Air monitoring stations : జంతువుల కదలికలను గుర్తించే ఎయిర్ మానిటరింగ్ స్టేషన్స్..

Air monitoring stations : జంతువుల కదలికలను గుర్తించే ఎయిర్ మానిటరింగ్ స్టేషన్స్..
Air monitoring stations


Air monitoring stations : గాలిలో ఎలాంటి గ్యాసులు కలుస్తాయి అనేది ఫిల్డర్ చేయడం చాలా కష్టం. మనం విడిచే శ్వాస దగ్గర నుండి ఇండస్ట్రీలు, పరిశ్రమలు నుండి విడుదలయ్యే హానికరమైన గ్యాసులు కూడా ఈ గాలిలోనే కలుస్తాయి. అందుకే ఇతర కాలుష్య రకాలతో పోలిస్తే.. గాలి కాలుష్యం అనేది ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే పలు ప్రాంతాల్లో ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ ఫిల్టర్స్ వల్ల మరొక ప్రయోజనం కూడా ఉందని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.

గాలిలో డీఎన్ఏ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కేవలం మనుషులదే కాదు.. జంతువుల డీఎన్ఏ కూడా గాలిలో కలిసిపోయి ఉంటుంది. అయితే ఎయిర్ క్వాలిటీ గురించి టెస్ట్ చేసే స్టేషన్లు, ఎయిర్ ఫిల్టర్స్ కూడా చాలా డీఎన్ఏను గమనిస్తాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అంతే కాకుండా ఎక్కడైతే ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయో.. అక్కడ చుట్టు పక్కన ప్రాంతాల్లో మనుషులు కానీ జంతువులు కానీ జీవిస్తున్నారా అనే విషయాన్ని ఈ డీఎన్ఏలు కనుక్కుంటున్నాయని వారు తెలిపారు.


మామూలుగా ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు అనేవి సిటీల్లోనే కాదు.. అడవుల్లో కూడా అక్కడక్కడా ఏర్పాటయ్యి ఉంటాయి. అలా అడవుల్లో మనుషుల సంచారం కానీ జంతువుల సంచారం కానీ ఉందేమో తెలుసుకోవడం కోసం ఈ ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బయోడైవర్సిటీ కోసం, గాలి కాలుష్యంపై దృష్టి పెట్టడం కోసం ఈ ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు అధికారులు. దీని ఆధారంగా గత కొన్నేళ్లుగా బయోడైవర్సిటీ స్టడీలు జరుగుతున్నాయని వారు బయటపెట్టారు.

మామూలుగా జంతువులు అడవుల్లో సంచరిస్తున్న సమయంలో వాటి ఆనవాళ్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటాయి. అలా ఆ ఆనవాళ్ల నుండి డీఎన్ఏ అనేది ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటుంది. మామూలుగా సముద్రాల్లో, నదుల్లో దొరికే డీఎన్ఏ ద్వారా ఎలాంటి జంతువులు అక్కడ ఉండేవో తెలుసుకోవడం సులభం. కానీ నేలపై ఉన్న డీఎన్ఏ ఆధారంగా జంతువుల గురించి తెలుసుకోవడం కష్టం. కానీ ఎయిర్ మానిటరింగ్ స్టేషన్స్ అనేవి వాటి గురించి తెలుసుకోవడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×